News September 6, 2025

ఆళ్లగడ్డలో ఈ మాస్టర్ వేరే లెవల్ అంతే..!

image

ఆళ్లగడ్డలో తైక్వాండో, మార్షల్ ఆర్ట్స్‌లో మాస్టర్ ఎల్‌టీ చంద్రమౌళి పేరు తెలియని వారెవరూ ఉండరు. 20ఏళ్లుగా ఎందరో క్రీడాకారులకు మార్షల్ ఆర్ట్స్‌లో శిక్షణ ఇచ్చి, వారిని ఉన్నత స్థాయికి తీసుకెళ్లిన ఘనత ఈయనకు దక్కింది. తన సొంత స్థలంలోనే అకాడమీ స్థాపించి, ఉచితంగా శిక్షణ ఇస్తూ ఎందరినో తైక్వాండో క్రీడాకారులుగా తీర్చిదిద్దారు. నేడు టీచర్స్ డే సందర్భంగా ఆయన దగ్గర క్రీడాకారులు ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు.

Similar News

News September 6, 2025

కామారెడ్డిలో కాంగ్రెస్ బీసీ డిక్లరేషన్ సభ

image

కామారెడ్డిలో కాంగ్రెస్ పార్టీ భారీ బహిరంగ సభకు ఏర్పాట్లు చేస్తోంది. ఈ నెల 15న జరగనున్న ఈ సభలో బీసీ డిక్లరేషన్‌ అమలు, అసెంబ్లీలో 42% రిజర్వేషన్లపై తీర్మానం చేసిన సందర్భంగా సంబరాలు జరుపుకోనున్నారు. ఈ సభలో రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గే, సీఎం రేవంత్ రెడ్డి పాల్గొనే అవకాశం ఉంది. ఈ సభకు సంబంధించిన సన్నాహక సమావేశం ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షబ్బీర్ నివాసంలో శనివారం జరిగింది.

News September 6, 2025

పురుగు మందుల కొనుగోలు- జాగ్రత్తలు

image

పంటకు ఆశించినది తెగులో, పురుగో గుర్తించి.. వ్యవసాయ అధికారుల సిఫార్సు మేరకు నమ్మకమైన డీలర్ల నుంచి పురుగు మందులను కొనాలి. డీలర్ నుంచి మందు వివరాల రసీదును తప్పనిసరిగా తీసుకోవాలి. 2,3 రకాల మందులు అందుబాటులో ఉంటే విషపూరిత గుణాన్ని బట్టి తక్కువ హాని కలిగించే మందును ఎన్నుకోవాలి. ప్యాకెట్‌పై ఆ మందును ఏ పంటలో ఏ పురుగు, తెగులు కోసం సిఫార్సు చేశారో చూసి తీసుకోవాలి. ప్యాకింగ్, గడువు తేదీని తప్పక చూడాలి.

News September 6, 2025

పురుగు మందులు.. రైతులకు సూచనలు

image

ఒకే మందు పొడి మందుగా, నీటిలో కరిగే ద్రావణంగా, గుళికల రూపంలో లభ్యమౌతుంటే.. ఆశించిన తెగులు, పంట దశ, నీటి లభ్యత, సమస్య తీవ్రతను బట్టి ఎంచుకోవాలి. పొడి మందులు గాలికి ఎగిరిపోయి వాతావరణ కాలుష్యం కలిగించవచ్చు. నీటిలో కరిగే పొడిమందులను సరిగా కలపకపోతే స్ప్రేయర్‌ల నాజిల్స్‌లో చేరి సరిగా పనిచేయవు. నాసిరకం మందులు కలుపుతున్నప్పుడు చర్మం నుంచి శరీరంలోకి ప్రవేశించే అవకాశం ఉంది. అందుకే వీటిని జాగ్రత్తగా వాడాలి.