News April 3, 2024
కేజ్రీవాల్ పిటిషన్.. తీర్పు రిజర్వ్
లిక్కర్ స్కాం కేసులో ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ వేసిన పిటిషన్‌పై తీర్పును హైకోర్టు రిజర్వ్ చేసింది. తన అరెస్ట్, రిమాండ్‌ను సవాల్ చేస్తూ కేజ్రీవాల్ హైకోర్టును ఆశ్రయించారు. ఎన్నికల నేపథ్యంలో కావాలనే తనను అరెస్ట్ చేశారని ఆయన ఆరోపించారు. సీఎం, ఈడీ తరఫున ఉదయం నుంచి సుదీర్ఘ వాదనలు విన్న న్యాయస్థానం తీర్పును రిజర్వ్ చేసింది.
Similar News
News November 9, 2024
చట్టాలను ఉల్లంఘించిన స్విగ్గీ, జొమాటో: నివేదిక
స్విగ్గీ, జొమాటో సంస్థలు భారత్‌లో కాంపిటీషన్ చట్టాలను అతిక్రమించాయని కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా(CCI) తేల్చింది. తమ యాప్‌లలో కొన్ని హోటళ్లకు ప్రాధాన్యాన్ని ఇచ్చి, వాటికి లాభాన్ని చేకూర్చేలా రెండు కంపెనీలు వ్యవహరించాయని పేర్కొంది. దీనికోసం ఆయా హోటళ్లతో కాంట్రాక్టులు కుదుర్చుకున్నాయని ఆరోపించింది. ఈ విషయంలో వాటిపై ఎటువంటి పెనాల్టీ విధించాలన్నది త్వరలో వెల్లడిస్తామని తెలిపింది.
News November 9, 2024
T20I: భారత్ తరఫున అత్యధిక సెంచరీలు
అంతర్జాతీయ టీ20ల్లో అత్యధిక సెంచరీలు చేసిన ఆటగాడిగా హిట్ మ్యాన్ రోహిత్ శర్మ(5) అగ్రస్థానంలో ఉన్నారు. ఆ తర్వాతి స్థానాల్లో సూర్యకుమార్ యాదవ్ (4), కేఎల్ రాహుల్ (2), సంజూ శాంసన్ (2) ఉన్నారు. బంగ్లాదేశ్, దక్షిణాఫ్రికాపై వరుస సెంచరీలు చేసిన సంజూ ఈ జాబితాలో కేఎల్ సరసన చేరారు.
News November 9, 2024
నవంబర్ 9: చరిత్రలో ఈరోజు
* ప్రపంచ నాణ్యతా దినోత్సవం
* 1877: కవి మహమ్మద్ ఇక్బాల్ జననం
* 1895: ఆధునిక ఆంధ్ర కవి దువ్వూరి రామిరెడ్డి జననం
* 1924: రచయిత, కథకుడు కాళీపట్నం రామారావు జననం
* 1978: సినీనటుడు రాజా పుట్టినరోజు
* 2009: నోబెల్ గ్రహీత హరగోబింద్ ఖురానా మరణం(ఫొటోలో)
* 2005: మాజీ రాష్ట్రపతి కేఆర్ నారాయణన్ మరణం