News September 6, 2025
నేడు తాడిపత్రికి పెద్దారెడ్డి.. రంగంలోకి పోలీసు బలగాలు

తాడిపత్రిలో నేడు జిల్లా SP జగదీశ్ పర్యటించనున్నారు. మాజీ MLA కేతిరెడ్డి పెద్దారెడ్డి తాడిపత్రికి రానున్న నేపథ్యంలో శాంతిభద్రతల పర్యవేక్షణకు బలగాలతో ఎస్పీ జగదీశ్ బయలుదేరారు. ఎవరైనా అల్లరి సృష్టించేందుకు ప్రయత్నిస్తే ఉపేక్షించే పరిస్థితి లేదని ఆయన స్పష్టం చేశారు. ఘర్షణలకు దిగితే కఠిన చర్యలు తీసుకుని జైలుకు పంపుతామని హెచ్చరించారు.
Similar News
News September 6, 2025
కామారెడ్డిలో కాంగ్రెస్ బీసీ డిక్లరేషన్ సభ

కామారెడ్డిలో కాంగ్రెస్ పార్టీ భారీ బహిరంగ సభకు ఏర్పాట్లు చేస్తోంది. ఈ నెల 15న జరగనున్న ఈ సభలో బీసీ డిక్లరేషన్ అమలు, అసెంబ్లీలో 42% రిజర్వేషన్లపై తీర్మానం చేసిన సందర్భంగా సంబరాలు జరుపుకోనున్నారు. ఈ సభలో రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గే, సీఎం రేవంత్ రెడ్డి పాల్గొనే అవకాశం ఉంది. ఈ సభకు సంబంధించిన సన్నాహక సమావేశం ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షబ్బీర్ నివాసంలో శనివారం జరిగింది.
News September 6, 2025
పురుగు మందుల కొనుగోలు- జాగ్రత్తలు

పంటకు ఆశించినది తెగులో, పురుగో గుర్తించి.. వ్యవసాయ అధికారుల సిఫార్సు మేరకు నమ్మకమైన డీలర్ల నుంచి పురుగు మందులను కొనాలి. డీలర్ నుంచి మందు వివరాల రసీదును తప్పనిసరిగా తీసుకోవాలి. 2,3 రకాల మందులు అందుబాటులో ఉంటే విషపూరిత గుణాన్ని బట్టి తక్కువ హాని కలిగించే మందును ఎన్నుకోవాలి. ప్యాకెట్‌పై ఆ మందును ఏ పంటలో ఏ పురుగు, తెగులు కోసం సిఫార్సు చేశారో చూసి తీసుకోవాలి. ప్యాకింగ్, గడువు తేదీని తప్పక చూడాలి.
News September 6, 2025
పురుగు మందులు.. రైతులకు సూచనలు

ఒకే మందు పొడి మందుగా, నీటిలో కరిగే ద్రావణంగా, గుళికల రూపంలో లభ్యమౌతుంటే.. ఆశించిన తెగులు, పంట దశ, నీటి లభ్యత, సమస్య తీవ్రతను బట్టి ఎంచుకోవాలి. పొడి మందులు గాలికి ఎగిరిపోయి వాతావరణ కాలుష్యం కలిగించవచ్చు. నీటిలో కరిగే పొడిమందులను సరిగా కలపకపోతే స్ప్రేయర్‌ల నాజిల్స్‌లో చేరి సరిగా పనిచేయవు. నాసిరకం మందులు కలుపుతున్నప్పుడు చర్మం నుంచి శరీరంలోకి ప్రవేశించే అవకాశం ఉంది. అందుకే వీటిని జాగ్రత్తగా వాడాలి.