News September 6, 2025
రికార్డు స్థాయిలో రూ.4.03 లక్షలు పలికిన వినాయకుని లడ్డూ

మనుబోలులోని చెర్లోపల్లి గేటు వద్ద ఉన్న విశ్వనాధ స్వామి ఆలయంలోని వినాయకుడి లడ్డూకు వేలంపాట నిర్వహించగా రికార్డు స్థాయిలో రూ.4.03 లక్షల ధర పలికింది. గుండు బోయిన వెంకటేశ్వర్లు వేలంపాటలో లడ్డూను దక్కించుకున్నాడు. అలాగే వెయ్యి రూపాయల డబ్బుల మాలను యోగేంద్ర రూ.2.50 లక్షలకు, రూ.5 కాయన్ రూ.50 వేలకు కావేటి పెంచలయ్య వేలం పాటలో దక్కించుకున్నారు.
Similar News
News September 6, 2025
దంపతుల గుండె పగిలేలా చేసిన ప్రమాదం

ఒక్కగానొక్క బిడ్డ. మళ్లీ పిల్లలు పుట్టే అవకాశం లేకపోవడంతో <<17627461>>అల్లారుముద్దుగా<<>> పెంచుకున్నారు. కష్టం దరిచేరకుండా కంటికి రెప్పలా కాపాడుకున్నారు. కానీ విధి వారి ఆశల్ని చిదిమేసింది. సూళ్లూరుపేట(M) అబాక హరిజనవాడలో రోటవేటర్‌లో పడి ఇద్దరు చిన్నారులు చనిపోయిన విషయం తెలిసిందే. కృష్ణయ్య చిన్న కుమారుడు, కోడలికి దివాన్(3) ఒక్కడే బిడ్డ. ఆ పిల్లాడి మృతితో దంపతులు గుండెలు పగిలేలా విలపించారు.
News September 6, 2025
విషాదం.. ట్రాక్టర్ కింద పడి ఇద్దరు చిన్నారుల మృతి

సుళ్లూరుపేట(M)లో శుక్రవారం విషాదం చోటు చేసుకుంది. ట్రాక్టర్ కింద పడి ఇద్దరు చిన్నారులు ప్రాణాలు విడిచారు. స్థానికుల సమాచారం మేరకు.. అబాక హరిజనావాడకు చెందిన A.కృష్ణయ్య పొలానికి ట్రాక్టర్‌పై వెళుతుండగా ‘మేము వస్తాం’ అంటూ ఇద్దరు మనమరాళ్లు, మనవడు మారం చేశారు. దీంతో చేసేది లేక ఆయన వారిని తీసుకుని బయలుదేరాడు. పొలాన్ని దున్నుతుండగా ప్రమాదవశాత్తు రోటవేటర్ కింద పడి కుందన(11), దివాన్ (3) చనిపోయారు.
News September 6, 2025
మాజీ MLA ప్రసన్న బెయిల్ పిటిషన్ 8కి వాయిదా

కోవూరు మాజీ MLA నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి బెయిల్ పిటిషన్‌పై హైకోర్టులో శుక్రవారం వాదనలు జరిగాయి. వైసీపీ అధినేత జగన్ జిల్లా పర్యటనకు వచ్చినప్పుడు ఓ హెడ్ కానిస్టేబుల్ గాయపడ్డారు. ప్రసన్న కుమార్ రెడ్డి వల్లే హెడ్ కానిస్టేబుల్ గాయపడ్డారంటూ అయనపై పోలీసులు హత్యాయత్నం కేసు నమోదు చేశారు. ఇందులో ముందస్తు బెయిల్ ఇవ్వాలని ప్రసన్న కోర్టును ఆశ్రయించగా.. విచారించిన న్యాయమూర్తి 8కి వాయిదా వేశారు.