News September 6, 2025
HYD: ఉత్తమ టీచర్‌గా స్నేహలత

మినిస్ట్రీ ఆఫ్ స్కిల్ డెవలప్‌మెంట్ తరపున నిర్మాణ రంగంలో HYD NAC టీచర్ స్నేహలతను జాతీయ ఉత్తమ టీచర్ అవార్డు వరించింది. టీచర్స్ డే సందర్భంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, జాతీయ ఉత్తమ టీచర్ అవార్డును ఆమెకు అందజేసి అభినందించారు. తనకు ఇంత గొప్ప గౌరవం దక్కటం గర్వంగా ఉందని స్నేహలత తెలిపారు.
Similar News
News September 6, 2025
BREAKING: CBI డైరెక్టర్ ప్రవీణ్‌కు అస్వస్థత

TG: సీబీఐ డైరెక్టర్ ప్రవీణ్ సూద్ అస్వస్థతకు గురయ్యారు. దీంతో వెంటనే ఆయనను హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లోని అపోలో ఆస్పత్రికి తరలించారు. శ్రీశైలం నుంచి HYD వస్తుండగా ఆయన అస్వస్థతకు గురైనట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ప్రవీణ్ ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉన్నట్లు సమాచారం. కాగా కాళేశ్వరం, న్యాయవాది వామనరావు దంపతుల హత్య కేసులను విచారించేందుకే ఆయన హైదరాబాద్ వచ్చారని వార్తలు వస్తున్నాయి.
News September 6, 2025
కేటీఆర్ భద్రాచలం పర్యటన వాయిదా: BRS

బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ KTR భద్రాచలం పర్యటన వాయిదా పడినట్లు బీఆర్‌ఎస్ నియోజకవర్గ నాయకుడు రావులపల్లి రామ్‌ప్రసాద్ తెలిపారు. సెప్టెంబర్ 10, 11న భద్రాచలంలో జరగాల్సిన కేటీఆర్ పర్యటన అనివార్య కారణాలతో వాయిదా పడిందని, తదుపరి పర్యటన వివరాలను త్వరలోనే ప్రకటిస్తామని తెలిపారు. ఈ విషయాన్ని పార్టీ నాయకులు, కార్యకర్తలు గమనించాలని సూచించారు.
News September 6, 2025
HNK: ఉత్తమ ఉపాధ్యాయుల ఎంపికలో అవకతవకలు

హనుమకొండ జిల్లాలో నిర్వహించిన ఉత్తమ ఉపాధ్యాయుల ఎంపికలో అనేక అవకతవకలు జరిగినట్లు ఉపాధ్యాయులు ఆరోపణలు గుప్పిస్తున్నారు. తొలుత గురువారం సాయంత్రం 48 మందితో విద్యాశాఖ లిస్ట్‌ను విడుదల చేసింది. అదే రోజు అర్ధరాత్రి లిస్ట్‌ను 40కి కుదించించారు. శుక్రవారం అవార్డుల కార్యక్రమ ప్రారంభంలో 55 మందికి లిస్ట్ చేరింది. ఇక అవార్డులు మాత్రం 62 మందికి ప్రదానం చేశారు. డీఈవో వాసంతి తీరుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.