News September 6, 2025

సీఎంతో అనకాపల్లి డీసీఎంఎస్ ఛైర్మన్ భేటీ

image

అనకాపల్లి జిల్లా సహకార మార్కెటింగ్ సొసైటీ (డీసీఎంఎస్) అభివృద్ధికి సహకారం అందించాలని చైర్మన్ కోట్ని బాలాజీ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు శుక్రవారం విశాఖ వచ్చిన సీఎం చంద్రబాబును శుక్రవారం కలిసి డీసీఎంఎస్‌కు సంబంధించి పలు సమస్యలపై వినతిపత్రం అందజేశారు. విశాఖలో డిసిఎంఎస్ ద్వారా రైతులకు ఎరువులు, విత్తనాలు, విద్యార్థులకు పుస్తకాలు విక్రయించేందుకు అనుమతి ఇవ్వాలని కోరారు.

Similar News

News September 6, 2025

నెల్లూరు: స్మార్ట్ రేషన్ కార్డులో తప్పులు!

image

చేజర్ల(M) ఆదురుపల్లిలో స్మార్ట్ రేషన్ కార్డుల్లో పొరపాట్లు బయటపడ్డాయి. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా ప్రారంభించిన స్మార్ట్ కార్డులలో వయస్సు, ఇంటిపేర్లలో లోపాలు నమోదయ్యాయి. పఠాన్ ఆఫిఫా తవస్సు వయసు 14 ఉండగా 18 ఏళ్లుగా నమోదు కాగా, కొందరి ఇంటిపేర్లు షేక్ స్థానంలో షైక్‌గా నమోదయ్యాయి. పొరపాట్లను వెంటనే సరిచేయాలని బాధితులు కోరుతున్నారు. మీ స్మార్ట్‌ కార్డులలో కూడా ఇలానే ఉంటే కామెంట్ చేయండి.

News September 6, 2025

అల్లూరి: 3.63 కిలోల లిక్విడ్ గంజాయి స్వాధీనం

image

పాడేరు మండలం కరకపుట్టు జంక్షన్ వద్ద 3.63 కిలోల హాషిస్ ఆయిల్ స్వాధీనం చేసుకొని ఒకరిని అరెస్ట్ చేసినట్లు ఎన్ఫోర్స్మెంట్ ఏఈఎస్ కె.సురేష్ తెలిపారు. ముందస్తు సమాచారం మేరకు కరకపుట్టు జంక్షన్ వద్ద మాటు వేయగా 4 ప్యాకెట్లులో హాస్ ఆయిల్(గంజాయి లిక్విడ్) పట్టుబడిందన్నారు. ఈ ఘటనలో అలగం గ్రామానికి చెందిన వండలం చిన్నబాలన్నను అరెస్ట్ చేశామని, మరో నిందితుడు వండలం కృష్ణారావు పరారీలో ఉన్నట్లు పేర్కొన్నారు.

News September 6, 2025

మైండ్ మ్యాపింగ్.. ప్రిపరేషన్‌లో గొప్ప సాధనం

image

పుస్తకంలోని కాన్సెప్టులు, మీ ఆలోచనలను అనుసంధానం చేసేలా విజువల్ రేఖాచిత్రాలను రూపొందించుకోవడాన్నే మైండ్ మ్యాపింగ్ అంటారు. ప్రిపరేషన్‌లో స్టడీ స్కిల్స్‌ను పెంపొందించడంలో ఇదొక గొప్ప సాధనం. పెద్ద సబ్జెక్టును చిన్న విభాగాలుగా విభజించుకుని గ్రాఫిక్ రూపంలో చదివితే అయోమయం తగ్గుతుంది. ఫోకస్, మెమరీ, సృజనాత్మకత పెరుగుతుంది. రివిజన్‌కు అనుకూలంగా ఉంటుంది. సమయం ఆదా అవుతుంది.