News September 6, 2025
తిరుమల: దర్శనానికి 24 గంటలు

AP: తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. శ్రీవారి దర్శనం కోసం భక్తులు శిలా తోరణం వరకు క్యూలో వేచి ఉన్నారు. టోకెన్లు లేని భక్తులకు సర్వ దర్శనానికి 24 గంటల సమయం పడుతోంది. నిన్న శ్రీవారిని 69,531 మంది భక్తులు దర్శించుకున్నారు. 31,439 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. హుండీ ద్వారా రూ.3.49 కోట్ల ఆదాయం వచ్చిందని టీటీడీ వెల్లడించింది.
Similar News
News September 6, 2025
కార్లు కొనే వారికి ‘మహీంద్రా’ బంపరాఫర్

GST సవరణలో భాగంగా పలు కార్ల ధరలు భారీగా తగ్గనున్న విషయం తెలిసిందే. ఈ నెల 22 నుంచి తగ్గిన ధరలు అమలులోకి రానున్నాయి. కానీ మహీంద్రా కంపెనీ ముందే శుభవార్త చెప్పింది. ఇవాళ్టి నుంచే వారి SUV వాహనాలపై జీఎస్టీ బెనిఫిట్స్ అందుబాటులో ఉంటాయని పేర్కొంది. రూ.1.56 లక్షల వరకు ఆదా చేసుకోవచ్చని తెలిపింది. ‘ప్రామిస్ చేయడమే కాదు.. చేసి చూపిస్తాం. థాంక్యూ మహీంద్రా ఆటో’ అని ఆనంద్ మహీంద్రా ట్వీట్ చేశారు.
News September 6, 2025
ఆయిల్ ఇండియా లిమిటెడ్‌లో 102 పోస్టులు

ఆయిల్ ఇండియా లిమిటెడ్‌లో 102 పోస్టులకు నోటిఫికేషన్ విడుదలైంది. ఆసక్తి, అర్హతగల అభ్యర్థులు ఈనెల 26వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. గ్రేడ్-Cలో 3 పోస్టులు, గ్రేడ్-Bలో 97పోస్టులు, గ్రేడ్-Aలో 2పోస్టులు ఉన్నాయి. పోస్టును బట్టి బీఈ, బీటెక్, PG, MBA, PGBM, CA, ICWA, CS ఉత్తీర్ణతతో పాటు ఉద్యోగానుభవం ఉండాలి. CBT, స్కిల్ టెస్ట్, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేయనున్నారు.
వెబ్‌సైట్: <
News September 6, 2025
కవిత ఆరోపణల తర్వాత తొలిసారి కేసీఆర్‌తో హరీశ్ భేటీ

TG: కవిత సంచలన ఆరోపణల తర్వాత మాజీ మంత్రి హరీశ్ రావు తొలిసారి బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్‌ను కలిశారు. లండన్ నుంచి తిరిగివచ్చిన ఆయన ఎర్రవల్లిలో కేసీఆర్‌తో భేటీ అయ్యారు. ఇప్పటికే కేటీఆర్ కూడా అక్కడే ఉండటంతో ముగ్గురూ సమావేశం అయ్యారు. ఇందులో కవిత అంశం చర్చకు వస్తుందా? లేదా? అనేది ఆసక్తికరంగా మారింది. కాగా హరీశ్‌పై ఆరోపణలు చేసిన కవితను పార్టీ నుంచి కేసీఆర్ సస్పెండ్ చేసిన విషయం తెలిసిందే.