News September 6, 2025

HYD: వారేవా! బుడ్డోడు భక్తితో గణపయ్యను కట్టేశాడు

image

HYDలో గణేశ్ నిమజ్జనంలో 5 ఏళ్ల బాలుడు సందడి చేశాడు. చిన్న గణపయ్యను తాను ఆడుకునే బైక్‌పైనే ట్యాంక్ బండ్‌పైకి తీసుకురావడం అందరినీ ఆకట్టుకుంది. అ బాలుడి భక్తికి అక్కడికి వచ్చిన పర్యాటకులందరూ తన్మయత్వంలో మునిగారు. ‘గణపయ్యను తాళ్లతోనే కాకుండా నీ భక్తితో కట్టేశావ్.. నీకు సకల శుభాలు కలుగుగాక’ అంటూ దీవిస్తున్నారు. అతడితో ఫొటోలు దిగారు. ఈ అబ్బాయి వీడియో సోషల్ మీడియాలో చెక్కర్లు కొడుతోంది.

Similar News

News September 6, 2025

HYD: అప్రమత్తమైన అగ్నిమాపక, ఎస్డీఆర్‌ఎఫ్ బృందాలు

image

గణేశ్ నిమజ్జనాలు సురక్షితంగా జరిగేలా తెలంగాణ అగ్నిమాపక, ఎస్డీఆర్‌ఎఫ్ (స్టేట్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్) బృందాలు అప్రమత్తమయ్యాయి. ప్రధాన సరస్సులు, బేబీ పాండ్స్ వద్ద ఫైర్ టెండర్లు, క్రేన్లు, బోట్లు, శిక్షణ పొందిన ఈతగాళ్లతో బృందాలను సిద్ధంగా ఉంచారు. పోలీసులు, జీహెచ్‌ఎంసీతో కలిసి ఈ బృందాలు పనిచేస్తున్నాయి. నిమజ్జనం సమయంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు.

News September 6, 2025

HYD: మళ్లీ వస్తా.. మిమ్మల్నే చూస్తుంటా!

image

ఖైరతాబాద్ మహా గణపతి గంగమ్మఒడికి చేరాడు. ఆయనరాకతో 11 రోజుల పాటు నగరమంతా కలకలలాడింది. ఉత్సవాల్లో భాగమైన నిమజ్జనం అనివార్యం కావడంతో గంగమ్మ చెంతకు చేరాడు. ‘ఎప్పటిలాగే మీకోసం మళ్లీ వస్తా.. అప్పటిదాకా మిమ్మల్నే చూస్తుంటా’ అన్నంట్లున్న ఆయన చూపు అందరి హృదయాలను బరువెక్కించింది. ఈ మహా క్రతువును చూసేందుకు వేలాదిగా ప్రజలు హుస్సేన్‌సాగర్‌కు తరలివచ్చారు.

News September 6, 2025

జయజయధ్వానాల నడుమ గంగమ్మ ఒడికి గణపయ్య

image

ఖైరతాబాద్ గణేశ్ నిమజ్జనం మొదలైంది. గణపతి బప్పా మోరియా జయజయధ్వానాల నడుమ క్రేన్ సాయంతో గణపయ్యను గంగమ్మ ఒడికి చేర్చుతున్నారు. ట్యాంక్ బండ్ పరిసరాలు గణపయ్య నామ స్మరణతో దద్దరిల్లుతున్నాయి. గణపతిని చూసేందుకు భక్తులు భారీగా తరలివచ్చారు.