News September 6, 2025
ఖమ్మంలో వేడుకలకు సర్వం సిద్ధం

తొమ్మిది రోజుల పాటు భక్తుల పూజలు అందుకున్న గణనాథుడు నేడు నిమజ్జనానికి సిద్ధమయ్యారు. ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా నిమజ్జన ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఖమ్మం నగరంలో మున్నేరు వద్ద, భద్రాచలంలో గోదావరి వద్ద అధికారులు నిమజ్జన ఏర్పాట్లు చేశారు. భద్రత కోసం సీసీ కెమెరాలు, క్రేన్లు, గజఈతగాళ్లతో పాటు భారీగా పోలీసులు మోహరించారు.
Similar News
News September 6, 2025
KMM: శోభాయాత్ర, నిమజ్జనాలకు కట్టుదిట్టమైన బందోబస్తు

ఖమ్మం నగరంలో శోభాయాత్ర, నిమజ్జన కార్యక్రమాల కోసం ప్రభుత్వ యంత్రాంగం నిమగ్నమైంది. ప్రభుత్వ ఉన్నతాధికారుల పర్యవేక్షణలో ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి. ఊరేగింపులు జరిగే ప్రాంతాల్లో ప్రత్యేక పోలీస్ బృందాలను మోహరించారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా సమస్యాత్మక ప్రాంతాలపై పోలీసులు ప్రత్యేక దృష్టి సారించారు. శాంతిభద్రతల పరిరక్షణకు అన్ని చర్యలూ తీసుకుంటున్నట్లు సీపీ సునీల్ దత్ తెలిపారు.
News September 5, 2025
వేంసూరు: నిమజ్జన ఊరేగింపులో అపశ్రుతి

వేంసూరు మండలంలో జరిగిన గణేశ్ నిమజ్జన ఊరేగింపులో అపశ్రుతి చోటుచేసుకుంది. గురువారం అర్ధరాత్రి వి.వెంకటాపురం గ్రామంలో నిమజ్జనానికి వెళ్తుండగా ట్రాక్టర్ పైనుంచి షేక్ రషీద్ (20) అనే యువకుడు కిందపడి మృతి చెందాడు. ట్రాక్టర్ నడుపుతున్న రషీద్ స్నేహితుడికి డ్రైవింగ్ ఇచ్చి పక్కన కూర్చున్నాడు. ప్రమాదవశాత్తు కిందపడి తీవ్ర గాయాలు కావడంతో చనిపోయాడు.
News September 5, 2025
అధికారులు సమన్వయంతో పని చేయాలి: ఖమ్మం సీపీ

గణేశ్ విగ్రహాల నిమజ్జనోత్సవ కార్యక్రమాలలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా అధికారులు అప్రమత్తంగా వ్యవహరించాలని ఖమ్మం పోలీస్ కమిషనర్ సునీల్ దత్ సూచించారు. ప్రతి విభాగం సమన్వయంతో ముందస్తు చర్యలు తీసుకోవాలని, శాంతి భద్రతల పరిరక్షణకు కఠినమైన పర్యవేక్షణ కొనసాగుతుందని ఆయన స్పష్టం చేశారు. డీజేలకు అనుమతి లేదని, నిర్దేశించిన సమయంలోనే విగ్రహాలను నిమజ్జనం చేయాలని ప్రత్యేకంగా సూచించారు.