News September 6, 2025

NLG: రేపు రేణుకా ఎల్లమ్మ ఆలయం మూసివేత

image

కనగల్(M) ధర్వేశిపురం శ్రీ రేణుకా ఎల్లమ్మ అమ్మవారి దేవస్థానంలో ఈనెల 7న ఆదివారం పాక్షిక చంద్రగ్రహణం సందర్భంగా ఆ రోజు మధ్యాహ్నం 1 గంట నుంచి మరుసటి రోజు తెల్లవారుజాము 3 గంటల వరకు ఆలయం మూసి వేయనున్నట్లు ఆలయ ఇన్‌ఛార్జ్ ఈవో నాగిరెడ్డి తెలిపారు. సోమవారం తెల్లవారుజామున 3 గంటలకు ఆలయ శుద్ధి, సంప్రోక్షణ తదితర కార్యక్రమాలు నిర్వహిస్తామన్నారు. ఉదయం 7 గంటల నుంచి అమ్మవారి దర్శనాలు ప్రారంభమవుతాయన్నారు.

Similar News

News September 6, 2025

NLG: అమ్మానాన్నతో ఇంటికి గణపయ్య..!

image

గణేష్ నవరాత్రి ఉత్సవాలు చండూరులో ఘనంగా ముగిశాయి. నిమజ్జనం సందర్భంగా నిర్వహించిన శోభాయాత్ర కన్నుల పండుగగా సాగింది. ఈ యాత్రలో చిన్నారులు పార్వతి పరమేశ్వరుల వేషధారణలో చూపరులను ఆకట్టుకున్నారు. వారి వేషధారణలు, ఆకర్షణీయమైన అలంకరణలు భక్తులను మంత్రముగ్ధులను చేశాయి. గణేష్ ఊరేగింపులో వారు భక్తులకు దీవెనలను అందిస్తూ ముందుకు సాగారు. వారిని చూసేందుకు పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చారు.

News September 6, 2025

NLG: భక్తులకు చెరువుగట్టు ఈవో కీలక సూచన

image

చెరువుగట్టు శ్రీ పార్వతి జడల రామలింగేశ్వర స్వామి దేవస్థానంలో ఈనెల 7న ఆదివారం పాక్షిక చంద్రగ్రహణం సందర్భంగా మధ్యాహ్నం 12 గంటలకు స్వామివారి నివేదన అనంతరం ఆలయం మూసి వేయనున్నట్లు ఆలయ ఈవో నవీన్ కుమార్ తెలిపారు. సోమవారం ఆలయ శుద్ధి, సంప్రోక్షణ తదితర కార్యక్రమాలు నిర్వహిస్తామన్నారు. ఉదయం 8 గంటల నుంచి స్వామివారి దర్శనాలు ప్రారంభమవుతాయన్నారు.

News September 6, 2025

NLG: వినాయక నిమజ్జనానికి వెళ్లి వస్తుండగా మృతి

image

వినాయక నిమజ్జనంలో శుక్రవారం రాత్రి అపశ్రుతి చోటుచేసుకుంది. తిప్పర్తి మండలం, మర్రిగూడెం గ్రామానికి చెందిన ఏశబోయిన యాదయ్య(45) వినాయక నిమజ్జనం చేసి తిరిగి వస్తుండగా ట్రాక్టర్ డ్రైవర్ పక్కన కూర్చుని ప్రమాదవశాత్తు పైనుంచి జారి కింద పడిపోయాడు. ఈ ప్రమాదంలో ట్రాక్టర్ పైనుంచి వెళ్లడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడికి భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు.