News September 6, 2025
SIIMA: ప్రభాస్ మూవీకి ‘బెస్ట్ ఫిల్మ్’ అవార్డ్

రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా నాగ్ అశ్విన్ తెరకెక్కించిన సైఫై థ్రిల్లర్ ‘కల్కి 2898 AD’ని SIIMA బెస్ట్ ఫిల్మ్ అవార్డ్ వరించింది. ప్రొడ్యూసర్ ప్రియాంకా దత్ పురస్కారాన్ని స్వీకరించారు. బెస్ట్ సపోర్టింగ్ రోల్(మేల్, ఫీమేల్), బెస్ట్ నెగటివ్ రోల్ అవార్డులను కూడా ఈ మూవీ సొంతం చేసుకుంది. ఓవరాల్‌గా ‘కల్కి 2898 AD’కి 4, <<17626582>>పుష్ప-2కు<<>> 4, దేవరకు 3, హనుమాన్, కమిటీ కుర్రోళ్లు చిత్రాలకు 2 చొప్పున అవార్డ్స్ వచ్చాయి.
Similar News
News September 6, 2025
గోవా షిప్‌యార్డ్‌లో 30 పోస్టులు

<
News September 6, 2025
BREAKING: ఇండియా-A కెప్టెన్‌గా శ్రేయస్ అయ్యర్

ఇండియా-A జట్టు కెప్టెన్‌గా స్టార్ ప్లేయర్ శ్రేయస్ అయ్యర్‌ను బీసీసీఐ నియమించింది. ఈ నెల 19 నుంచి ఆస్ట్రేలియా Aతో జరగబోయే రెండు మల్టీ డే మ్యాచుల కోసం జట్టును ఎంపిక చేసింది. జట్టు: అయ్యర్ (C), ఈశ్వరన్, జగదీశ్వరన్(WK), సాయి సుదర్శన్, ధ్రువ్ జురేల్ (VC&WK), దేవదత్ పడిక్కల్, హర్ష్ దూబే, ఆయుష్ బదోనీ, నితీశ్ రెడ్డి, తనుష్ కోటియన్, ప్రసిద్ధ్ కృష్ణ, గుర్నూర్ బ్రార్, ఖలీల్ అహ్మద్, మానవ్ సుతార్, యశ్ ఠాకూర్
News September 6, 2025
గర్భిణులు రోజుకెంత ఉప్పు తీసుకోవాలంటే..

గర్భిణులు ఆహారం విషయంలో ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటారు. కానీ రోజుకి ఎంత ఉప్పు తినాలో కొందరికి తెలియదు. గర్భిణులు రోజుకి 3.8-5.8 గ్రాముల ఉప్పు తీసుకోవాలి. దీని కంటే ఎక్కువగా తీసుకుంటే కాళ్లు, చేతుల వాపులు, తరచుగా మూత్రవిసర్జన, అధిక రక్తపోటు సమస్యలు వస్తాయని గైనకాలజిస్ట్‌లు చెబుతున్నారు. మరీ తక్కువ ఉప్పు తీసుకున్నా బలహీనత, నీరసం వస్తాయి. కాబట్టి సరైన మోతాదులో ఉప్పు తీసుకోవాలని సూచిస్తున్నారు.