News September 6, 2025
టెస్లా కారు కొన్న మంత్రి.. ‘స్వదేశీ’ ఏమైంది?

భారత్‌లో తొలి టెస్లా Y మోడల్ కారును మహారాష్ట్ర మంత్రి ప్రతాప్ <<17619296>>కొనుగోలు<<>> చేసిన విషయం తెలిసిందే. దీనిపై నెటిజన్ల నుంచి విమర్శలు వస్తున్నాయి. స్వదేశీ వస్తువులు కొనుగోలు చేయాలని ప్రధాని మోదీ దేశ ప్రజలకు పిలుపునిచ్చిన విషయం గుర్తు లేదా అని ప్రశ్నిస్తున్నారు. మంత్రులే ప్రధాని మాటను లెక్కచేయకపోతే ఎలా అని నిలదీస్తున్నారు. టాటా, మహీంద్రా లాంటి కంపెనీలు కనబడట్లేదా అని ఫైరవుతున్నారు. దీనిపై మీ కామెంట్?
Similar News
News September 6, 2025
గోవా షిప్‌యార్డ్‌లో 30 పోస్టులు

<
News September 6, 2025
BREAKING: ఇండియా-A కెప్టెన్‌గా శ్రేయస్ అయ్యర్

ఇండియా-A జట్టు కెప్టెన్‌గా స్టార్ ప్లేయర్ శ్రేయస్ అయ్యర్‌ను బీసీసీఐ నియమించింది. ఈ నెల 19 నుంచి ఆస్ట్రేలియా Aతో జరగబోయే రెండు మల్టీ డే మ్యాచుల కోసం జట్టును ఎంపిక చేసింది. జట్టు: అయ్యర్ (C), ఈశ్వరన్, జగదీశ్వరన్(WK), సాయి సుదర్శన్, ధ్రువ్ జురేల్ (VC&WK), దేవదత్ పడిక్కల్, హర్ష్ దూబే, ఆయుష్ బదోనీ, నితీశ్ రెడ్డి, తనుష్ కోటియన్, ప్రసిద్ధ్ కృష్ణ, గుర్నూర్ బ్రార్, ఖలీల్ అహ్మద్, మానవ్ సుతార్, యశ్ ఠాకూర్
News September 6, 2025
గర్భిణులు రోజుకెంత ఉప్పు తీసుకోవాలంటే..

గర్భిణులు ఆహారం విషయంలో ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటారు. కానీ రోజుకి ఎంత ఉప్పు తినాలో కొందరికి తెలియదు. గర్భిణులు రోజుకి 3.8-5.8 గ్రాముల ఉప్పు తీసుకోవాలి. దీని కంటే ఎక్కువగా తీసుకుంటే కాళ్లు, చేతుల వాపులు, తరచుగా మూత్రవిసర్జన, అధిక రక్తపోటు సమస్యలు వస్తాయని గైనకాలజిస్ట్‌లు చెబుతున్నారు. మరీ తక్కువ ఉప్పు తీసుకున్నా బలహీనత, నీరసం వస్తాయి. కాబట్టి సరైన మోతాదులో ఉప్పు తీసుకోవాలని సూచిస్తున్నారు.