News September 6, 2025
యాదాద్రి: ఉత్తమ ఉపాధ్యాయుడితి గౌరవం..!

డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతిని పురస్కరించుకొని జిల్లా ఉత్తమ ఉపాధ్యాయుడిగా గుండాల మండలం వస్తాకొండూర్ ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయుడు జంపాల రాజు ఎంపికయ్యారు. జిల్లాస్థాయి ఉత్తమ అవార్డు ఆయన్ను వరించింది. జిల్లా కలెక్టర్ చేతుల మీదుగా రాజు నిన్న అవార్డు అందుకున్నారు. గత 18 సంవత్సరాలుగా ఉపాధ్యాయ వృత్తిలో ఉన్న ఆయన అనేకమంది విద్యార్థులకు విద్యాబుద్ధులు నేర్పి ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దారు.
Similar News
News September 6, 2025
పోలీస్ కంట్రోల్ రూమ్‌ను సందర్శించిన CP

వరంగల్ పోలీస్ కమిషనర్ సన్‌ప్రీత్ సింగ్ శనివారం పోలీస్ కమిషనరేట్ కంట్రోల్ రూంను సందర్శించారు. ఈ సందర్శనలో కమిషనర్ కంట్రోల్ రూంలో పనిచేస్తున్న సిబ్బందితో మాట్లాడి, అత్యవసర కాల్స్ స్వీకరణ, స్పందన విధానం, డయల్ 100 కార్యకలాపాలను సమీక్షించారు. కమిషనర్ ప్రజల నుంచి వచ్చే ప్రతి కాల్‌ను అత్యంత జాగ్రత్తగా, తక్షణమే స్పందిస్తూ సమస్యల పరిష్కారం కోసం కృషి చేయాలని సిబ్బందిని ఆదేశించారు.
News September 6, 2025
సంగారెడ్డి: పర్యావరణ పరిరక్షణ అందరి బాధ్యత: కలెక్టర్

పర్యావరణ పరిరక్షణ మనందరి బాధ్యత అని సంగారెడ్డి జిల్లా కలెక్టర్ ప్రావీణ్య అన్నారు. కొండాపూర్‌లోని తొగర్‌పల్లి జిల్లా పరిషత్ పాఠశాలలో శనివారం నిర్వహించిన వనమహోత్సవంలో భాగంగా ఆమె మొక్కలు నాటారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరూ నాటిన మొక్కను సంరక్షించే బాధ్యత తీసుకోవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో తహశీల్దార్ అశోక్, ఆత్మ కమిటీ ఛైర్మన్ ప్రభు, మాజీ ఎంపీటీసీ నరసింహారెడ్డి తదితరులు పాల్గొన్నారు.
News September 6, 2025
సిరిసిల్ల: సఖి కేంద్రంలో ఉద్యోగాలకు దరఖాస్తుల ఆహ్వానం

రాజన్న సిరిసిల్ల జిల్లాలోని సఖి కేంద్రంలో ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు అధికారులు తెలిపారు. ఈ పోస్టులకు దరఖాస్తు చేసే అభ్యర్థులు ప్రొఫెషనల్ డిగ్రీ లేదా లా డిగ్రీ చేసి ఉండాలని, అలాగే కనీసం మూడేళ్ల అనుభవం కలిగి ఉండాలని పేర్కొన్నారు. ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ.25,000 వేతనం లభిస్తుందని తెలిపారు. ఆసక్తి ఉన్నవారు కలెక్టరేట్‌లోని సఖి కేంద్రంలో దరఖాస్తులు సమర్పించాలన్నారు.