News September 6, 2025

విద్యుత్ శాఖ నిర్లక్ష్యం.. ఆగిన గణపయ్య రథం..!

image

విద్యుత్ శాఖ నిర్లక్ష్యంతో కరీంనగర్‌లో కొలువైన 35 అడుగుల భారీ గణేష్ శోభాయాత్ర తాత్కాలికంగా నిలిచిపోయింది. ముందుగానే సమాచారం ఇచ్చినప్పటికీ విద్యుత్ తీగలు తొలగించకపోవడంతో శోభాయాత్ర ఆగిపోయింది. ఈ క్రమంలో ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. విద్యుత్ అధికారుల కోసం “మిత్రా యూత్” నిర్వాహకులు ఎదురుచూస్తున్నారు. అధికారులు స్పందించి శోభాయాత్ర సాగేలా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

Similar News

News September 6, 2025

KNR: Way2news కథనానికి స్పందన..!

image

‘విద్యుత్ శాఖ నిర్లక్ష్యం.. ఆగిన గణపయ్య రథం’ అనే శీర్షికన ప్రచురితమైన Way2News కథనానికి విద్యుత్ శాఖ అధికారులు స్పందించారు. విగ్రహానికి అడ్డుగా ఉన్న విద్యుత్ తీగలు తొలగించే పనుల్లో అధికారులు నిమగ్నమయ్యారు. దీంతో 35 అడుగుల భారీ గణేష్ శోభాయాత్ర ముందుకు సాగనుంది. శోభాయాత్ర అనంతరం చింతకుంట కెనాల్లో స్వామివారిని నిమజ్జనం చేయనున్నారు. ఈ సందర్భంగా మిత్రా యూత్ సభ్యులు Way2Newsకు కృతజ్ఞతలు తెలిపారు.

News September 6, 2025

KNR: యూరియా లేక అన్నదాతల ఆందోళన

image

జిల్లా వ్యాప్తంగా పంపిణీ చేస్తున్న యూరియా కోసం ఎదురుచూపులు తప్పటం లేదని రైతులు తీవ్రంగా ఆందోళన చెందుతున్నారు. తెల్లవారుజాము నుంచే వేలాది రైతులు కిలోమీటర్ల మేర క్యూలలో నిలబడే దుస్థితి నెలకొందని వాపోయారు. ప్రస్తుతం పంటలకు యూరియా వేసే సమయం కావటంతో ఇబ్బందులు పడుతున్నామని.. పరిస్థతి ఇలానే ఉంటే పంట దిగుబడిపై తీవ్ర ప్రభావం పడుతుందని, ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి చర్యలు తీసుకోవాలని రైతున్న కోరుతున్నాడు.

News September 6, 2025

KNR: నిమజ్జనం పూర్తయ్యేదాకా అప్రమత్తత అవసరం

image

మనకొండూరులో జరుగుతున్న గణేష్ నిమజ్జనోత్సవాన్ని కలెక్టర్ పమేలా సత్పతి, సి.పి గౌస్ ఆలం, మున్సిపల్ కమిషనర్ ప్రపుల్ దేశాయ్‌తో కలిసి సందర్శించి కార్యక్రమాన్ని నిశితంగా పరిశీలించారు. భద్రతా ఏర్పాట్లు, ప్రజల రద్దీ నియంత్రణపై కలెక్టర్ తగు సూచనలు చేశారు. నిమజ్జనం పూర్తయ్యేవరకు అధికారులు అప్రమత్తతో ఉండాలని, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు.