News September 6, 2025

వికారాబాద్ ఎస్పీ కీలక సూచనలు

image

గణేశ్ నిమజ్జనానికి పోలీసులు గైడ్‌లైన్స్ విడుదల చేశారు.
* సాధ్యమైనంతవరకు ఉదయమే శోభయాత్రను ప్రారంభించాలి.* అప్పుడు భక్తులు పాల్గొనే అవకాశం ఉంటుంది. * చీకటి పడక ముందే నిమజ్జనం వీలవుతుంది.* ఎక్కడపడితే అక్కడ నిమజ్జనం చేయరాదు. * నిర్దేశిత దేశాల్లో నిమజ్జనం చేయాలి. * డీజేలకు అనుమతి లేదు.*అనుకోని ఘటనలు ఎదురైతే డయల్ 100 కాల్ చేసి సమాచారం ఇవ్వాలి.

Similar News

News September 6, 2025

ఏలూరు: ‘చెక్ పోస్టులతో పటిష్ఠమైన నిఘా పెట్టాలి’

image

ఏలూరు జిల్లా నుంచి ఎరువులు ఇతర ప్రాంతాలకు తరలిపోకుండా జిల్లా, అంతరాష్ట్ర సరిహద్దుల వద్ద చెక్ పోస్టులు ఏర్పాటు చేసి పటిష్ఠమైన నిఘా పెట్టాలని కలెక్టర్ K.V.వెట్రిసెల్వి అధికారులను ఆదేశించారు. జిల్లాలో ఎరువుల లభ్యత, సరఫరాలపై శనివారం కలెక్టరేట్ నుంచి సంబంధిత శాఖల అధికారులతో టెలి కాన్ఫ్‌రెన్స్ ద్వారా కలెక్టర్ సమీక్షించారు. జిల్లాలో రైతులకు అవసరమైన ఎరువులు నిల్వలు ఉన్నాయని తెలిపారు.

News September 6, 2025

పేలుడు పదార్థాలు గుర్తించడంలో ‘హంటర్’ కీలకం: ఎస్పీ

image

పేలుడు పదార్థాలు గుర్తించడంలో బెల్జియం దేశ మలునాయిస్ జాతికి చెందిన హంటర్ డాగ్ కీలకమైన సేవలు అందిస్తుందని ఎస్పీ విక్రాంత్ పాటిల్ అన్నారు. శనివారం మంగళగిరి పోలీస్ హెడ్ క్వార్టర్స్ నుంచి వచ్చిన హంటర్ డాగ్‌ను ఎస్పీ తన ఛాంబర్‌లో పరిశీలించారు. ఆయన మాట్లాడుతూ.. మంగళగిరిలోని 6వ బెటాలియన్‌లో హంటర్ డాగ్ 10 నెలల పాటు శిక్షణ తీసుకుందని, అసాంఘిక శక్తులు చేసే కుట్రలను ఈ డాగ్ పసిగడుతుందన్నారు.

News September 6, 2025

మెరుగైన వైద్య‌సేవ‌ల‌ను అందించాలి: VZM కలెక్టర్

image

క్షేత్ర‌స్థాయిలో మెరుగైన వెద్య‌సేవ‌ల‌ను అందించాల‌ని క‌లెక్టర్ అంబేడ్కర్ ఆదేశించారు. శృంగ‌వ‌ర‌పుకోట నియోజ‌క‌వ‌ర్గ ప‌రిధిలోని వైద్యారోగ్య‌, ప‌శు సంవ‌ర్థ‌క‌శాఖ అధికారులు, క్షేత్ర‌స్థాయి సిబ్బందితో క‌లెక్ట‌రేట్‌లో శ‌నివారం స‌మీక్షా నిర్వ‌హించారు. PHC, CHCల ద్వారా అందిస్తున్న వైద్యం, గ్రామాల్లో ఏఎన్ఎంలు, ఆశా వ‌ర్క‌ర్ల ద్వారా అందిస్తున్న సేవ‌ల‌పై స‌మీక్షించారు.