News September 6, 2025

BHPL: యువకుడిని కిడ్నాప్ చేసి హత్య

image

యుడకుడిని కిడ్నాప్ చేసి కాళ్లు, చేతులు కట్టేసి, పెట్రోల్ పోసి హత్య చేసిన ఘటన <<17625671>>BHPL<<>> జిల్లాలో జరిగింది. పోలీసుల ప్రకారం.. BHPLకి చెందిన బాసిత్(21) మూడు రోజుల క్రితం కిడ్నాప్ ఐనట్లు తల్లి సబియా ఫిర్యాదు చేసింది. పట్టణానికి చెందిన పలువురు తన కొడుకును హత్య చేశారని ఆరోపించింది. మేడారం సమీప అడవుల్లో మృతదేహం లభించింది. ఇన్‌స్టాగ్రామ్‌లో పెట్టిన మెసేజ్‌ల వల్లే గొడవ జరిగిందని పోలీసులు అనుమానిస్తున్నారు.

Similar News

News September 6, 2025

ఎం.అలమండ: పాము కాటుతో యువకుడి మృతి

image

దేవరాపల్లి మండలం ఎం.అలమండ గ్రామానికి చెందిన బుడ్డ శ్రీను(28) పాము కాటుకి గురై మృతి చెందాడు. శుక్రవారం రాత్రి స్నేహితులతో కలిసి బహిర్భూమికి వెళ్లాడు. ఆ సమయంలో విషసర్పం ఎడమకాలిపై కాటేసింది. వెంటనే కె.కోటపాడు సీహెచ్సీకి తరలించగా.. అప్పటికే ప్రాణాలు కోల్పోయాడు. ఒక్కగానొక్క కుమారుడు చనిపోవడంతో కుటుంబం విషాదంలో మునిగిపోయింది.

News September 6, 2025

లిక్కర్ కేసు: ముగ్గురు నిందితులకు బెయిల్

image

AP: లిక్కర్ కేసు నిందితులైన ధనుంజయ్ రెడ్డి, బాలాజీ గోవిందప్ప, కృష్ణమోహన్ రెడ్డికి బెయిల్ వచ్చింది. విజయవాడ ఏసీబీ కోర్టు వీరికి బెయిల్ మంజూరు చేసింది. ఒక్కొక్కరూ రూ.లక్ష చొప్పున 2 ష్యూరిటీలు ఇవ్వాలని ఆదేశించింది. అలాగే, ముగ్గురూ పాస్‌పోర్టు వివరాలు అందించాలంది. ఇప్పటికే ఉప రాష్ట్రపతి ఎన్నిక సందర్భంగా ఓటు వేసేందుకు ఎంపీ మిథున్ రెడ్డికి మధ్యంతర బెయిల్ రాగా, ఆయన రాజమండ్రి జైలు నుంచి విడుదలయ్యారు.

News September 6, 2025

SIIMA అవార్డు అందుకున్న మాధవధార హీరో

image

దుబాయ్ వేడుకగా జరిగిన SIIMA అవార్డులో మాధవధారకు చెందిన హీరో పేడాడ సందీప్ సరోజ్‌కు అవార్డు లభించింది. కమిటీ కుర్రోలు చిత్రంతో పేడాడ సందీప్ సరోజ్ ప్రేక్షకుల్ని అలరించాడు. ఈ చిత్రానికి గానూ బెస్ట్ డెబ్యూట్ యాక్టర్‌గా అవార్డు అందుకున్నాడు. ఆయనకు పలువురు సినీ ప్రముఖులు, అభిమానులు అభినందనలు తెలిపారు. సందీప్ సరోజ్ తల్లి రమణకుమారి విశాఖ జిల్లా వైసీపీ మహిళా అధ్యక్షురాలిగా వ్యవహరిస్తున్నారు.