News September 6, 2025

ట్రంప్ వ్యాఖ్యలను అభినందిస్తున్నా: మోదీ

image

మోదీ తనకు మిత్రుడని, భారత్‌తో అమెరికాకు <<17626556>>ప్రత్యేక అనుబంధం<<>> ఉందని ట్రంప్ చేసిన వ్యాఖ్యలపై ప్రధాని మోదీ స్పందించారు. ‘ఇరు దేశాల బంధాలు, సెంటిమెంట్లపై ట్రంప్ చేసిన వ్యాఖ్యలను అభినందిస్తున్నా. ప్రపంచ వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని ముందుకు తీసుకెళ్లేందుకు భారత్, అమెరికా చాలా సానుకూల దృక్పథంతో ఉన్నాయి’ అని మోదీ ట్వీట్ చేశారు.

Similar News

News September 6, 2025

లిక్కర్ కేసు: ముగ్గురు నిందితులకు బెయిల్

image

AP: లిక్కర్ కేసు నిందితులైన ధనుంజయ్ రెడ్డి, బాలాజీ గోవిందప్ప, కృష్ణమోహన్ రెడ్డికి బెయిల్ వచ్చింది. విజయవాడ ఏసీబీ కోర్టు వీరికి బెయిల్ మంజూరు చేసింది. ఒక్కొక్కరూ రూ.లక్ష చొప్పున 2 ష్యూరిటీలు ఇవ్వాలని ఆదేశించింది. అలాగే, ముగ్గురూ పాస్‌పోర్టు వివరాలు అందించాలంది. ఇప్పటికే ఉప రాష్ట్రపతి ఎన్నిక సందర్భంగా ఓటు వేసేందుకు ఎంపీ మిథున్ రెడ్డికి మధ్యంతర బెయిల్ రాగా, ఆయన రాజమండ్రి జైలు నుంచి విడుదలయ్యారు.

News September 6, 2025

అనుష్క ‘ఘాటి’కి షాకింగ్ కలెక్షన్స్!

image

హీరోయిన్ అనుష్క శెట్టి ప్రధాన పాత్రలో నటించిన ‘ఘాటీ’ మూవీ తొలి రోజు రూ.5.33 కోట్ల గ్రాస్ రాబట్టినట్లు తెలుస్తోంది. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమాకు మిక్స్‌డ్ టాక్ రావడంతో తక్కువ కలెక్షన్లు వచ్చినట్లు సమాచారం. అనుష్క నటించిన రుద్రమదేవి మూవీ తొలి రోజు రూ.12 కోట్లు, భాగమతి సినిమా రూ.11 కోట్లు రాబట్టాయి. వాటితో పోల్చుకుంటే ఈ వసూళ్లు తక్కువేనని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

News September 6, 2025

ఆ యువతి డ్రగ్స్‌తో పట్టుబడటంతో..

image

TG: హైదరాబాద్ శివారులో డ్రగ్స్ <<17630840>>ఫ్యాక్టరీ<<>> గుట్టు రట్టవడం సంచలనం రేపిన విషయం తెలిసిందే. మహారాష్ట్ర మీరా రోడ్‌లో గతనెల బంగ్లాదేశ్‌కు చెందిన ఫాతిమా రూ.24 లక్షల విలువైన డ్రగ్స్‌తో పోలీసులకు పట్టుబడింది. దీంతో తీగ లాగితే మేడ్చల్ జిల్లాలో కెమికల్ ఫ్యాక్టరీ పేరిట డ్రగ్స్ తయారుచేస్తున్నట్లు తేలింది. ఐటీ ప్రొఫెషనల్ అయిన వ్యక్తే తన తెలివితో కెమికల్స్ ద్వారా డ్రగ్స్ ఉత్పత్తి చేస్తున్నట్లు గుర్తించారు.