News September 6, 2025

గణేశ్ మహా నిమజ్జనానికి GHMC అన్ని ఏర్పాట్లు

image

గ్రేటర్ HYDలో నేడు గణేశ్ మహా నిమజ్జనం జరుగనుంది. నిమజ్జనం సజావుగా సాగేందుకు GHMC అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. పోలీస్‌, ఇతర శాఖలతో సమన్వయం చేస్తూ కార్యక్రమం సాఫీగా జరగడానికి చర్యలు తీసుకుంది. స్వచ్ఛతకు ప్రాధాన్యం ఇస్తూ 15వేల మంది సిబ్బందితో 24×7 పారిశుద్ధ్య కార్యక్రమాలు చేపడుతోంది. నగర వ్యాప్తంగా శోభాయాత్రలను మేయర్ విజయలక్ష్మి, కమిషనర్ ఆర్వీ కర్ణన్ నిమజ్జనాన్ని మానిటర్ చేస్తున్నారు.

Similar News

News September 6, 2025

ట్యాంక్‌బండ్‌లో నిమజ్జనం.. ఏరియల్ వ్యూ

image

నగరంలో గణేశ్ నిమజ్జన కార్యక్రమం సజావుగా సాగుతోందని నిర్ధారించుకునేందుకు అధికారులు ఏరియల్ వ్యూ ద్వారా పర్యవేక్షించారు. బేగంపేట విమానాశ్రయం నుంచి నిమజ్జన సరళిని మంత్రి పొన్నం ప్రభాకర్, మేయర్ గద్వాల విజయలక్ష్మీ, డీజీపీ జితేందర్, హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్, జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వీ కర్ణన్, కలెక్టర్ దాసరి హరిచందన సమీక్షించారు.

News September 6, 2025

HYD: రేపు ఉ.10 గం.కు రోడ్లు ఓపెన్!

image

రేపు ఉ.10 గంటలలోపు హుస్సేన్‌సాగర్ చుట్టుపక్కల రహదారులపై జనరల్ ట్రాఫిక్ అనుమతించడానికి ప్రయత్నిస్తామని HYD సీపీ ఆనంద్ తెలిపారు. అలాగే నెక్లెస్ రోడ్‌‌పై విగ్రహాలు ఉన్న వాహనాలను నాలుగు వరుసలలో ఉంచి, రేపు రాత్రి వరకు నిమజ్జనం పూర్తి చేస్తామని పేర్కొన్నారు. HYD వ్యాప్తంగా 29,000 మంది పోలీసులు నిర్విరామంగా కృషి చేస్తున్నారన్నారు.

News September 6, 2025

HYD: రూ.2.32 కోట్లకు లడ్డూ.. ఆ డబ్బుతో ఏం చేస్తారో తెలుసా?

image

బండ్లగూడ రిచ్ మండ్ విలాస్‌లో గణేశ్ లడ్డూ రికార్డు సృష్టించింది. 10 కిలోల లడ్డూ 2025లో రూ.2.32 కోట్లు ధర సాధించింది. ఇది 2024లో రూ.1.87 కోట్ల కంటే రూ.45 లక్షలు ఎక్కువ. గతంలో 2022లో రూ.60.48 లక్షలు, 2023లో రూ.1.26 కోట్లు, 2024లో రూ.1.87 కోట్లు పలికింది. ఈ మొత్తాన్ని ఆర్వి దివ్య చారిటబుల్ ట్రస్ట్‌కు అందజేస్తారు. దీని ద్వారా 42కిపైగా ఎన్జీఓలు వృద్ధుల సంరక్షణ, మహిళల ఆరోగ్యం, విద్య, వైద్యం అందిస్తారు.