News September 6, 2025
విద్యారంగంలో సిద్దిపేటకు ఉత్తమ అవార్డు

విద్యారంగంలో ఓవరాల్‌గా ఉత్తమ పనితీరు కనబరిచిన జిల్లాగా సిద్దిపేట ఎంపికైంది. హైదరాబాద్‌లో జరిగిన కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ హైమావతి, డీఈవో శ్రీనివాస్‌రెడ్డి ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి చేతుల మీదుగా అవార్డును స్వీకరించారు. ఈ అవార్డు సాధించినందుకు అధికారులు, ప్రజాప్రతినిధులు వారికి అభినందనలు తెలిపారు.
Similar News
News September 6, 2025
భారీ వరదలు.. బీజేపీ ఎంపీల డిన్నర్ పార్టీ రద్దు

బీజేపీ ఎంపీలకు ఇవాళ రాత్రి ఆ పార్టీ జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డా ఇవ్వాల్సిన డిన్నర్ పార్టీ రద్దయింది. ఈనెల 9న ఉపరాష్ట్రపతి ఎన్నిక నేపథ్యంలో తమ పార్టీ ఎంపీలకు విందు ఇవ్వాలని బీజేపీ ఇటీవల నిర్ణయించింది. అయితే పంజాబ్, J&K తదితర రాష్ట్రాల్లో భారీ వర్షాలు, వరదలతో 100 మందికి పైగా చనిపోవడంతో డిన్నర్ పార్టీని క్యాన్సిల్ చేశారు. ఈనెల 8న పీఎం నివాసంలో జరగాల్సిన NDA ఎంపీల విందు కూడా రద్దయింది.
News September 6, 2025
స్టేట్ బెస్ట్ టీచర్ అవార్డ్ అందుకున్న వడ్డాది ప్రిన్సిపల్

వడ్డాది ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రిన్సిపల్ జి.చిన్నారావు రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయుడిగా అవార్డు స్వీకరించారు. శుక్రవారం సాయంత్రం అమరావతిలో జరిగిన గురుపూజోత్సవ వేడుకల్లో సీఎం చంద్రబాబు, రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి నారా లోకేశ్ చేతుల మీదుగా ప్రశంసా పత్రం, మెమెంటో స్వీకరించారు.16 ఏళ్ల నుంచి ఇంగ్లిష్ అధ్యాపకుడిగా పని చేశారు. ఇటీవల పదోన్నతిపై వడ్డాదికి ప్రిన్సిపల్‌గా వచ్చారు
News September 6, 2025
శ్రీకాకుళం: ఇంటర్ పూర్తి చేశారా..ఈ అవకాశం మీకోసమే

ఇంటర్మీడియేట్ వృత్తి, విద్యా కోర్సులు అభ్యసించి ఉత్తీర్ణులైన వారికి అప్రెంటిస్ మేళా జరగనుంది. ఈ నెల 8న ఎచ్చెర్లలోని ప్రభుత్వ ఐటీఐలో నిర్వహించే ఈ మేళాను సద్వినియోగం చేసుకోవాలని జిల్లా ఇంటర్మీడియట్ వృత్తి విద్యాశాఖ అధికారి సురేష్ కుమార్ తెలిపారు. అప్రెంటిస్ ఎంపికలతో ఉద్యోగావకాశాలు మెరుగుపడతాయని ప్రభుత్వ ఐటీఐ ఎచ్చెర్ల ప్రిన్సిపల్ ఎల్.సుధాకరరావు కన్వీనర్ అన్నారు.