News September 6, 2025

ముమ్మిడివరం: రూ.30 కోట్లతో జంప్

image

చిట్టీల పేరిట మురముళ్లలో రూ.30 కోట్లతో ఓ కేటుగాడు జంప్ అయ్యాడు. ఐ.పోలవరం(M) పశువుల్లంకకు చెందిన చింతలపూడి వీరా శంకరరావు మురముళ్ల కేంద్రంగా 30 ఏళ్లుగా వ్యాపారం చేస్తూ నమ్మకంగా ఉండేవాడు. ఇటీవల కాకినాడలో కొన్ని ఆస్థులను కొని పరారయ్యాడు. కొద్ది రోజులుగా ఫోన్ స్విచ్ఛాఫ్, ఇంటికి తాళం వేసి ఉండడంతో దాదాపు 100 మంది బాధితులు ఎమ్మెల్యే బుచ్చిబాబు, పోలీసులను ఆశ్రయించారు. ఎస్సై రవీంద్ర కేసు నమోదు చేశామన్నారు.

Similar News

News September 6, 2025

ట్యాంక్‌బండ్‌లో నిమజ్జనం.. ఏరియల్ వ్యూ

image

నగరంలో గణేశ్ నిమజ్జన కార్యక్రమం సజావుగా సాగుతోందని నిర్ధారించుకునేందుకు అధికారులు ఏరియల్ వ్యూ ద్వారా పర్యవేక్షించారు. బేగంపేట విమానాశ్రయం నుంచి నిమజ్జన సరళిని మంత్రి పొన్నం ప్రభాకర్, మేయర్ గద్వాల విజయలక్ష్మీ, డీజీపీ జితేందర్, హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్, జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వీ కర్ణన్, కలెక్టర్ దాసరి హరిచందన సమీక్షించారు.

News September 6, 2025

నిరుద్యోగులకు నెలకు రూ.3,500.. కేంద్రం ఏమందంటే?

image

దేశంలోని అర్హులైన నిరుద్యోగులందరికీ కేంద్రం నెలకు రూ.3,500 ఆర్థిక సాయం చేయనుందని, అప్లై చేసుకునే విధానం ఇదేనంటూ కొందరు యూట్యూబ్‌లో ప్రచారం చేస్తున్నారు. అయితే ఇలాంటి స్కీమ్‌లు కేంద్ర ప్రభుత్వం అమలు చేయట్లేదని PIB FactCheck వెల్లడించింది. ఇలాంటి తప్పుడు సమాచారాన్ని నమ్మొద్దని సూచించింది. ఇలాంటి పథకాలుంటే ప్రభుత్వమే ప్రకటిస్తుందని పేర్కొంది.

News September 6, 2025

భారీ వరదలు.. బీజేపీ ఎంపీల డిన్నర్ పార్టీ రద్దు

image

బీజేపీ ఎంపీలకు ఇవాళ రాత్రి ఆ పార్టీ జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డా ఇవ్వాల్సిన డిన్నర్ పార్టీ రద్దయింది. ఈనెల 9న ఉపరాష్ట్రపతి ఎన్నిక నేపథ్యంలో తమ పార్టీ ఎంపీలకు విందు ఇవ్వాలని బీజేపీ ఇటీవల నిర్ణయించింది. అయితే పంజాబ్‌, J&K తదితర రాష్ట్రాల్లో భారీ వర్షాలు, వరదలతో 100 మందికి పైగా చనిపోవడంతో డిన్నర్ పార్టీని క్యాన్సిల్ చేశారు. ఈనెల 8న పీఎం నివాసంలో జరగాల్సిన NDA ఎంపీల విందు కూడా రద్దయింది.