News September 6, 2025
ఇక IT ఎగుమతులపైనా US టారిఫ్స్?

భారత వస్తువులపై 50% టారిఫ్స్ వేస్తున్న US త్వరలో IT సేవలపైనా ట్యాక్స్ విధించొచ్చని తెలుస్తోంది. INDలోని చాలా IT కంపెనీలు USకు ఔట్‌సోర్సింగ్ సేవలందిస్తున్నాయి. వస్తువుల్లాగే లాగే సేవలపైనా TAX చెల్లించాలని US మాజీ నేవీ ఆఫీసర్ ట్వీట్ చేశారు. దీన్ని ట్రంప్ అడ్వైజర్ నవరో రీపోస్ట్ చేయడంతో భారత IT కంపెనీల్లో ఆందోళన మొదలైంది. దీనిని అమెరికన్ టెక్ వర్కర్స్ స్వాగతిస్తుండగా ఇండియన్ టెకీస్ ఖండిస్తున్నారు.
Similar News
News September 6, 2025
నిరుద్యోగులకు నెలకు రూ.3,500.. కేంద్రం ఏమందంటే?

దేశంలోని అర్హులైన నిరుద్యోగులందరికీ కేంద్రం నెలకు రూ.3,500 ఆర్థిక సాయం చేయనుందని, అప్లై చేసుకునే విధానం ఇదేనంటూ కొందరు యూట్యూబ్‌లో ప్రచారం చేస్తున్నారు. అయితే ఇలాంటి స్కీమ్‌లు కేంద్ర ప్రభుత్వం అమలు చేయట్లేదని PIB FactCheck వెల్లడించింది. ఇలాంటి తప్పుడు సమాచారాన్ని నమ్మొద్దని సూచించింది. ఇలాంటి పథకాలుంటే ప్రభుత్వమే ప్రకటిస్తుందని పేర్కొంది.
News September 6, 2025
భారీ వరదలు.. బీజేపీ ఎంపీల డిన్నర్ పార్టీ రద్దు

బీజేపీ ఎంపీలకు ఇవాళ రాత్రి ఆ పార్టీ జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డా ఇవ్వాల్సిన డిన్నర్ పార్టీ రద్దయింది. ఈనెల 9న ఉపరాష్ట్రపతి ఎన్నిక నేపథ్యంలో తమ పార్టీ ఎంపీలకు విందు ఇవ్వాలని బీజేపీ ఇటీవల నిర్ణయించింది. అయితే పంజాబ్, J&K తదితర రాష్ట్రాల్లో భారీ వర్షాలు, వరదలతో 100 మందికి పైగా చనిపోవడంతో డిన్నర్ పార్టీని క్యాన్సిల్ చేశారు. ఈనెల 8న పీఎం నివాసంలో జరగాల్సిన NDA ఎంపీల విందు కూడా రద్దయింది.
News September 6, 2025
లిక్కర్ కేసు: ముగ్గురు నిందితులకు బెయిల్

AP: లిక్కర్ కేసు నిందితులైన ధనుంజయ్ రెడ్డి, బాలాజీ గోవిందప్ప, కృష్ణమోహన్ రెడ్డికి బెయిల్ వచ్చింది. విజయవాడ ఏసీబీ కోర్టు వీరికి బెయిల్ మంజూరు చేసింది. ఒక్కొక్కరూ రూ.లక్ష చొప్పున 2 ష్యూరిటీలు ఇవ్వాలని ఆదేశించింది. అలాగే, ముగ్గురూ పాస్‌పోర్టు వివరాలు అందించాలంది. ఇప్పటికే ఉప రాష్ట్రపతి ఎన్నిక సందర్భంగా ఓటు వేసేందుకు ఎంపీ మిథున్ రెడ్డికి మధ్యంతర బెయిల్ రాగా, ఆయన రాజమండ్రి జైలు నుంచి విడుదలయ్యారు.