News September 6, 2025

కాసేపట్లో KCRతో హరీశ్‌రావు భేటీ!

image

TG: BRS నేత, మాజీమంత్రి హరీశ్ రావు లండన్ నుంచి హైదరాబాద్ వచ్చేశారు. కాసేపట్లో ఎర్రవల్లి ఫామ్‌హౌస్‌లో మాజీ సీఎం KCRతో హరీశ్ రావు భేటీ కానున్నారు. కవిత ఆరోపణలపై ఆయన కేసీఆర్‌తో చర్చించే అవకాశముంది. కవితను సస్పెండ్ చేయడంతో పార్టీ హరీశ్‌రావు వైపే ఉందని కేసీఆర్ క్లారిటీ ఇచ్చారు. కవిత, విపక్షాల విమర్శలు, కాళేశ్వరం నివేదిక అంశంపైనా వీరి మధ్య చర్చ జరగనున్నట్లు తెలుస్తోంది.

Similar News

News September 6, 2025

నిరుద్యోగులకు నెలకు రూ.3,500.. కేంద్రం ఏమందంటే?

image

దేశంలోని అర్హులైన నిరుద్యోగులందరికీ కేంద్రం నెలకు రూ.3,500 ఆర్థిక సాయం చేయనుందని, అప్లై చేసుకునే విధానం ఇదేనంటూ కొందరు యూట్యూబ్‌లో ప్రచారం చేస్తున్నారు. అయితే ఇలాంటి స్కీమ్‌లు కేంద్ర ప్రభుత్వం అమలు చేయట్లేదని PIB FactCheck వెల్లడించింది. ఇలాంటి తప్పుడు సమాచారాన్ని నమ్మొద్దని సూచించింది. ఇలాంటి పథకాలుంటే ప్రభుత్వమే ప్రకటిస్తుందని పేర్కొంది.

News September 6, 2025

భారీ వరదలు.. బీజేపీ ఎంపీల డిన్నర్ పార్టీ రద్దు

image

బీజేపీ ఎంపీలకు ఇవాళ రాత్రి ఆ పార్టీ జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డా ఇవ్వాల్సిన డిన్నర్ పార్టీ రద్దయింది. ఈనెల 9న ఉపరాష్ట్రపతి ఎన్నిక నేపథ్యంలో తమ పార్టీ ఎంపీలకు విందు ఇవ్వాలని బీజేపీ ఇటీవల నిర్ణయించింది. అయితే పంజాబ్‌, J&K తదితర రాష్ట్రాల్లో భారీ వర్షాలు, వరదలతో 100 మందికి పైగా చనిపోవడంతో డిన్నర్ పార్టీని క్యాన్సిల్ చేశారు. ఈనెల 8న పీఎం నివాసంలో జరగాల్సిన NDA ఎంపీల విందు కూడా రద్దయింది.

News September 6, 2025

లిక్కర్ కేసు: ముగ్గురు నిందితులకు బెయిల్

image

AP: లిక్కర్ కేసు నిందితులైన ధనుంజయ్ రెడ్డి, బాలాజీ గోవిందప్ప, కృష్ణమోహన్ రెడ్డికి బెయిల్ వచ్చింది. విజయవాడ ఏసీబీ కోర్టు వీరికి బెయిల్ మంజూరు చేసింది. ఒక్కొక్కరూ రూ.లక్ష చొప్పున 2 ష్యూరిటీలు ఇవ్వాలని ఆదేశించింది. అలాగే, ముగ్గురూ పాస్‌పోర్టు వివరాలు అందించాలంది. ఇప్పటికే ఉప రాష్ట్రపతి ఎన్నిక సందర్భంగా ఓటు వేసేందుకు ఎంపీ మిథున్ రెడ్డికి మధ్యంతర బెయిల్ రాగా, ఆయన రాజమండ్రి జైలు నుంచి విడుదలయ్యారు.