News September 6, 2025

బాలాపూర్ లడ్డూ చరిత్ర తెలుసా?

image

HYD బాలాపూర్‌లో 1980లో తొలిసారిగా గణేశుడి విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. 1994లో మొదటిసారి లడ్డూ వేలం నిర్వహించారు. రూ.450కి స్థానికుడు కొలను మోహన్ రెడ్డి కొనుగోలు చేశారు. లడ్డూను కుటుంబసభ్యులకు ఇవ్వడంతో పాటు వ్యవసాయ క్షేత్రంలో చల్లారు. దీంతో ఆ ఏడాది అన్ని పనుల్లోనూ వారికి మంచి జరిగింది. లడ్డూ పొందడం వల్లే కలిసొచ్చిందని భావించిన ఆ ఫ్యామిలీ.. చాలా సార్లు వేలంలో ఆ లడ్డూను దక్కించుకుంది.

Similar News

News September 6, 2025

నిరుద్యోగులకు నెలకు రూ.3,500.. కేంద్రం ఏమందంటే?

image

దేశంలోని అర్హులైన నిరుద్యోగులందరికీ కేంద్రం నెలకు రూ.3,500 ఆర్థిక సాయం చేయనుందని, అప్లై చేసుకునే విధానం ఇదేనంటూ కొందరు యూట్యూబ్‌లో ప్రచారం చేస్తున్నారు. అయితే ఇలాంటి స్కీమ్‌లు కేంద్ర ప్రభుత్వం అమలు చేయట్లేదని PIB FactCheck వెల్లడించింది. ఇలాంటి తప్పుడు సమాచారాన్ని నమ్మొద్దని సూచించింది. ఇలాంటి పథకాలుంటే ప్రభుత్వమే ప్రకటిస్తుందని పేర్కొంది.

News September 6, 2025

భారీ వరదలు.. బీజేపీ ఎంపీల డిన్నర్ పార్టీ రద్దు

image

బీజేపీ ఎంపీలకు ఇవాళ రాత్రి ఆ పార్టీ జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డా ఇవ్వాల్సిన డిన్నర్ పార్టీ రద్దయింది. ఈనెల 9న ఉపరాష్ట్రపతి ఎన్నిక నేపథ్యంలో తమ పార్టీ ఎంపీలకు విందు ఇవ్వాలని బీజేపీ ఇటీవల నిర్ణయించింది. అయితే పంజాబ్‌, J&K తదితర రాష్ట్రాల్లో భారీ వర్షాలు, వరదలతో 100 మందికి పైగా చనిపోవడంతో డిన్నర్ పార్టీని క్యాన్సిల్ చేశారు. ఈనెల 8న పీఎం నివాసంలో జరగాల్సిన NDA ఎంపీల విందు కూడా రద్దయింది.

News September 6, 2025

లిక్కర్ కేసు: ముగ్గురు నిందితులకు బెయిల్

image

AP: లిక్కర్ కేసు నిందితులైన ధనుంజయ్ రెడ్డి, బాలాజీ గోవిందప్ప, కృష్ణమోహన్ రెడ్డికి బెయిల్ వచ్చింది. విజయవాడ ఏసీబీ కోర్టు వీరికి బెయిల్ మంజూరు చేసింది. ఒక్కొక్కరూ రూ.లక్ష చొప్పున 2 ష్యూరిటీలు ఇవ్వాలని ఆదేశించింది. అలాగే, ముగ్గురూ పాస్‌పోర్టు వివరాలు అందించాలంది. ఇప్పటికే ఉప రాష్ట్రపతి ఎన్నిక సందర్భంగా ఓటు వేసేందుకు ఎంపీ మిథున్ రెడ్డికి మధ్యంతర బెయిల్ రాగా, ఆయన రాజమండ్రి జైలు నుంచి విడుదలయ్యారు.