News September 6, 2025
కరీంనగర్: రైస్ మిల్లర్లు మారట్లే..!

ఉమ్మడి KNRలో రైస్ మిల్లర్ల ఇష్టారాజ్యం నడుస్తోంది. పెండింగ్ CMR క్లియర్ చేయాలని అధికారులు కోరుతున్నా మిల్లర్లు పట్టించుకోవట్లేదు. PDPLలో 140 రైస్ మిల్లులుండగా 25 మిల్లుల నుంచి 24వేల టన్నుల CMR పెండింగ్లో ఉంది. KNRలో 133 మిల్లులుండగా 22 డీఫాల్టయ్యాయి. వీట్నుంచి రూ.126 కోట్ల విలువచేసే ధాన్యం ప్రభుత్వానికి రావాలి. సివిల్ సప్లై, విజిలెన్స్ & ఎన్ఫోర్స్మెంట్ దాడులు చేసినా మిల్లర్లు లైట్ తీసుకుంటున్నారు.
Similar News
News September 6, 2025
శ్రీకాకుళం: రేషన్ లబ్ధిదారులతో స్నేహపూర్వకంగా మెలగాలి

రేషన్ లబ్ధిదారులతో డీలర్లు స్మేహపూర్వకంగా మాట్లాడాలని కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ ఆదేశించారు. శనివారం కలెక్టర్ కార్యాలయం నుంచి రేషన్, గ్యాస్ డీలర్లతో సమావేశం నిర్వహించారు. రేషన్ షాపులకు వచ్చే లబ్ధిదారులతో సానుకూలదృక్పదంతో, కుటుంబ సభ్యుల్లా మాట్లాడాలన్నారు. సహనంతో ఉండాలన్నారు. ప్రభుత్వ ఆమోదం తెలిపిన ధరలకే గ్యాస్ సిలిండర్ డెలివరీ చేయాలన్నారు.
News September 6, 2025
పట్టణ పాలనపై పెద్దపల్లి కలెక్టర్ సమీక్ష

పెద్దపల్లి కలెక్టర్ కోయ శ్రీ హర్ష పట్టణాల్లో పాలన సమర్థవంతంగా కొనసాగాలని ఆదేశించారు. మంథని, సుల్తానాబాద్ మున్సిపాలిటీల పని తీరుపై కలెక్టరేట్‌లో శనివారం సమీక్ష నిర్వహించారు. రోడ్లపై పశువులు, కోతుల నియంత్రణ, డార్క్ ఏరియాల్లో లైటింగ్, నీటి సరఫరా, పారిశుద్ధ్యం, అక్రమ నిర్మాణాల తొలగింపు వంటి అంశాలపై అధికారులకు సూచనలు ఇచ్చారు. అభివృద్ధి పనులు నాణ్యతతో, సమయానికి పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.
News September 6, 2025
నిబద్ధతతో పనిచేస్తేనే మనుగడ: సిరిసిల్ల కలెక్టర్

నిబద్ధతో పనిచేస్తేనే వ్యవస్థ మనగడ సాధ్యమవుతుందని సిరిసిల్ల కలెక్టర్ సందీప్ కుమార్ ఝా అన్నారు. సిరిసిల్లలోని కలెక్టరేట్లో గ్రామ పాలన అధికారులకు శనివారం నియామకపత్రాలను అందజేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. రెవెన్యూ శాఖ ప్రభుత్వంలో చాలా కీలకమన్నారు. జిల్లాలో గ్రామ పంచాయతీలకు గ్రామ పాలన అధికారులను ప్రభుత్వం నియమించిందని జీపీఓలు క్షేత్రస్థాయిలో ప్రజలను నిబంధనల ప్రకారం మెరుగైన సేవలు అందించాలన్నారు.