News September 6, 2025
ఉపవాసం ఉంటే ఇన్ని ప్రయోజనాలా?

విష్ణువు భక్తుల్లో చాలామంది శనివారం నాడు ఉపవాసం ఉంటారు. దీనివల్ల దైవానుగ్రహం కలుగుతుందని భక్తుల నమ్మకం. అలాగే ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఉంటాయని వైద్యులు చెబుతున్నారు. ‘ఉపవాసం వల్ల శరీర మెటబాలిజం మెరుగుపడుతుంది. క్యాలరీలు బర్న్ అవుతాయి. కొవ్వు తగ్గుతుంది. డయాబెటిస్, BP అదుపులో ఉంటుంది. గ్యాస్, అసిడిటీ, కడుపు ఉబ్బరం నుంచి ఉపశమనం లభిస్తుంది. మానసిక ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది’ అని చెబుతున్నారు.
Similar News
News January 31, 2026
మున్సిపల్ ఎన్నికలు.. CM షెడ్యూల్ ఫిక్స్

TG: సీఎం రేవంత్ రెడ్డి మున్సిపల్ ఎన్నికల ప్రచార షెడ్యూల్ ఖరారైంది. 6 ఉమ్మడి జిల్లాల్లో ఆయన ప్రచారం చేయనున్నారు. ఫిబ్రవరి 4న ఉమ్మడి నల్గొండ జిల్లా మిర్యాలగూడ, 5న కరీంనగర్ జిల్లా చొప్పదండి, 6న నిజామాబాద్ రూరల్, 7న రంగారెడ్డి జిల్లా పరిగి, 8న ఉమ్మడి వరంగల్ జిల్లా భూపాలపల్లి, 9న మెదక్‌లో కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించాలని కోరనున్నారు.
News January 31, 2026
ఫ్యూచర్ ట్రేడింగ్.. వెండి రేటు రూ.1.28 లక్షలు డౌన్

కొన్ని రోజులుగా ఆకాశమే హద్దుగా పెరిగిన గోల్డ్, సిల్వర్ రేట్లు క్రమంగా పతనమవుతున్నాయి. <<19006060>>ఫ్యూచర్ ట్రేడింగ్<<>>(మార్చి)లో కేజీ వెండి ధర ఏకంగా రూ.1,28,126 పడిపోయి రూ.2,91,922 పలికింది. అలాగే ఏప్రిల్‌కు సంబంధించి 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర కూడా రూ.1,50,849కి పడిపోయింది. లైఫ్ టైమ్ హై(రూ.1,80,779)తో పోల్చితే రూ.29,930 తగ్గడం గమనార్హం.
News January 31, 2026
ఇంటి మీద గుడి నీడ పడకూడదా?

గుడి నీడ పడే చోట ఇంటి నిర్మాణం చేయకూడదని వాస్తు నిపుణులు కృష్ణాదిశేషు సూచిస్తున్నారు. ‘ఇంటిపై గుడి నీడ పడటం శాస్త్ర సమ్మతం కాదు. దేవాలయ ఆగమశాస్త్రం ప్రకారం దాన్ని మంత్రశక్తితో ప్రతిష్ఠిస్తారు. నిత్య హోమాలు, జపాలతో అక్కడ దైవశక్తి కేంద్రీకృతమై ఉంటుంది. నివాస గృహాల్లో జనన మరణాలు, మైల వంటివి సహజం. ఆ అశౌచం వల్ల గుడి పవిత్రతకు ఆటంకం కలుగుతుంది. ఆ పాపం తగలకూడదు. అందుకే దూరంగా ఉండాలి’ అంటున్నారు. <<-se>>#Vasthu<<>>


