News September 6, 2025

రూ.లక్షకు చేరువైన 22 క్యారెట్ల బంగారం ధర

image

బంగారం ధరలు ఆకాశమే హద్దుగా దూసుకెళ్తున్నాయి. హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో ఇవాళ 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.870 పెరిగి రూ.1,08,490కు చేరింది. ఇక 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రూ.800 ఎగబాకి రూ.99,450 పలుకుతోంది. మరో రెండ్రోజుల్లో చరిత్రలో తొలిసారి రూ.లక్ష క్రాస్ చేసే ఛాన్స్ ఉంది. అటు KG వెండిపై రూ.2,000 పెరిగి ఫస్ట్ టైమ్ రూ.1,38,000కు చేరుకుంది. తెలుగు రాష్ట్రాల్లో దాదాపు ఇవే ధరలున్నాయి.

Similar News

News September 6, 2025

రాష్ట్రపతి ముర్ముతో ప్రధాని మోదీ భేటీ

image

రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ముతో ప్రధాని మోదీ భేటీ అయ్యారు. రాష్ట్రపతి భవన్‌కు వెళ్లిన ఆయన ఈ నెల 9న జరగనున్న ఉప రాష్ట్రపతి ఎన్నిక, ఇతర అంశాల గురించి చర్చించినట్లు తెలుస్తోంది. భేటీకి సంబంధించిన పూర్తి వివరాలు కాసేపట్లో వెల్లడయ్యే అవకాశం ఉంది.

News September 6, 2025

ఓటీటీలోకి వచ్చేస్తున్న సూపర్‌హిట్ సినిమా

image

రూ.5 కోట్ల బడ్జెట్‌తో తీస్తే ఏకంగా రూ.120 కోట్లకు పైగా వసూళ్లు సాధించిన ‘సు ఫ్రం సో’ మూవీ ఓటీటీలోకి వచ్చేస్తోంది. ఈనెల 9 నుంచి జియో హాట్‌స్టార్ స్ట్రీమింగ్ చేయనుంది. జేపీ తుమినాడ్ దర్శకత్వం వహించిన ఈ హారర్ కామెడీ తొలుత కన్నడలో రిలీజై ఆకట్టుకుంది. తర్వాత తెలుగులోనూ విడుదల కాగా మంచి రెస్పాన్స్ వచ్చింది. దీంతో ఇప్పుడు ఓటీటీ ప్రేక్షకులను అలరించేందుకు వచ్చేస్తోంది.

News September 6, 2025

OFFICIAL: టీమ్ ఇండియాకు నో స్పాన్సర్

image

ఆసియా కప్ 2025 కోసం టీమ్ ఇండియా స్పాన్సర్ లేకుండానే బరిలోకి దిగుతోంది. తాజాగా శుభ్‌మన్ గిల్, శివమ్ దూబే ధరించిన జెర్సీలపై ఎలాంటి స్పాన్సర్ లోగో లేదు. దీంతో జట్టుకు ఎలాంటి స్పాన్సర్ లేరని అధికారికంగా తేలిపోయింది. మరోవైపు ఆసియాకప్‌లో పాకిస్థాన్‌తో భారత్ అన్ని మ్యాచులు ఆడుతుందని బీసీసీఐ కార్యదర్శి దేవజిత్ సైకియా స్పష్టం చేశారు. ద్వైపాక్షిక సిరీస్ మాత్రం ఎట్టిపరిస్థితుల్లో ఆడబోమని తెలిపారు.