News September 6, 2025
కోణార్క్ ఎక్స్‌ప్రెస్‌లో గర్భిణికి కవలలు జననం

కోణార్క్ ఎక్స్‌ప్రెస్ రైలులో ఇచ్ఛాపురానికి చెందిన గర్భిణి భూలక్ష్మి శుక్రవారం ఇద్దరు కవలలకు జన్మనిచ్చింది. మార్గం మధ్యలో పురిటినొప్పులు రావడంతో ఆమె భర్త జానకిరామ్ RPF సిబ్బందికి సమాచారం అందించారు. రైలును శ్రీకాకుళం స్టేషన్ వద్ద నిలిపి డాక్టర్‌ను పిలిపించారు. గర్భిణి రైలులో రైలులో ఆడ శిశువు, ఆసుపత్రిలో మగ శిశువుకు జన్మనిచ్చిది. తల్లి, శిశువులను ఆసుపత్రికి తరలించారు.
Similar News
News September 6, 2025
శ్రీకాకుళం: రేషన్ లబ్ధిదారులతో స్నేహపూర్వకంగా మెలగాలి

రేషన్ లబ్ధిదారులతో డీలర్లు స్మేహపూర్వకంగా మాట్లాడాలని కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ ఆదేశించారు. శనివారం కలెక్టర్ కార్యాలయం నుంచి రేషన్, గ్యాస్ డీలర్లతో సమావేశం నిర్వహించారు. రేషన్ షాపులకు వచ్చే లబ్ధిదారులతో సానుకూలదృక్పదంతో, కుటుంబ సభ్యుల్లా మాట్లాడాలన్నారు. సహనంతో ఉండాలన్నారు. ప్రభుత్వ ఆమోదం తెలిపిన ధరలకే గ్యాస్ సిలిండర్ డెలివరీ చేయాలన్నారు.
News September 6, 2025
శ్రీకాకుళం: ఇంటర్ పూర్తి చేశారా..ఈ అవకాశం మీకోసమే

ఇంటర్మీడియేట్ వృత్తి, విద్యా కోర్సులు అభ్యసించి ఉత్తీర్ణులైన వారికి అప్రెంటిస్ మేళా జరగనుంది. ఈ నెల 8న ఎచ్చెర్లలోని ప్రభుత్వ ఐటీఐలో నిర్వహించే ఈ మేళాను సద్వినియోగం చేసుకోవాలని జిల్లా ఇంటర్మీడియట్ వృత్తి విద్యాశాఖ అధికారి సురేష్ కుమార్ తెలిపారు. అప్రెంటిస్ ఎంపికలతో ఉద్యోగావకాశాలు మెరుగుపడతాయని ప్రభుత్వ ఐటీఐ ఎచ్చెర్ల ప్రిన్సిపల్ ఎల్.సుధాకరరావు కన్వీనర్ అన్నారు.
News September 6, 2025
SKLM: ‘యూరియా ప్రణాళికాబద్ధంగా పంపిణీ చేయాలి’

యూరియా ప్రణాళికాబద్ధంగా పంపిణీ చేయాలని కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ ఆదేశించారు. కలెక్టరేట్ నుంచి ఎరువులపై తహసీల్దార్లు, ఎంపీడీఓలు, ఎస్.ఐ.లు, వ్యవసాయ శాఖ పలు శాఖల అధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు. ఎరువులకు సంబంధించి డివిజన్ స్థాయిలో ఆర్డీఓ, డీఎస్పీ, వ్యవసాయ శాఖ ఏడీ ఉంటారన్నారు. ప్రతీ మండలంలో రెవెన్యూ, పోలీసు వ్యవసాయశాఖ ఏఓ మండల స్థాయిలో టాస్క్ఫోర్స్ ఉంటుందని చెప్పారు.