News September 6, 2025

అమరావతి: వేంకటేశ్వరస్వామిని దర్శించుకున్న కన్నా

image

అమరావతి ప్రాంతంలోని వెంకటపాలెం సమీపంలో ఉన్న టీటీడీ దేవస్థానంలో వేంకటేశ్వరస్వామిని సత్తెనపల్లి ఎమ్మెల్యే కన్నా లక్ష్మీనారాయణ శనివారం దర్శించుకున్నారు. ఈ మేరకు ఆలయ అర్చకులు కన్నాకు స్వాగతం పలికారు. దర్శనం అనంతరం స్వామివారి ఆశీర్వచనాలు ఎమ్మెల్యేకు అందజేశారు. అమరావతిలో వేంకటేశ్వరస్వామిని దర్శించుకోవడం సంతోషంగా ఉందని కన్నా అన్నారు.

Similar News

News September 6, 2025

గుజరాత్‌లో ప్రమాదం.. పల్నాడు యువకుడి మృతి

image

ముప్పాళ్ల మండలం మాదలకు చెందిన కొడవటి నరేశ్ (17) గుజరాత్‌లో జరిగిన రోడ్డు ప్రమాదంలో మరణించాడు. స్నేహితులతో కలిసి ఎస్‌యూవీ వాహనంలో టూర్‌కు వెళ్లిన సమయంలో ఈ ప్రమాదం జరిగిందని స్థానికులు తెలిపారు. వాహనం అదుపు తప్పడంతో శనివారం ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో మొత్తం ముగ్గురు మరణించగా, వీరిలో ఇద్దరు ఆంధ్రప్రదేశ్‌కు చెందినవారని పేర్కొన్నారు.

News September 6, 2025

జిల్లా పోలీస్ ట్రైనింగ్ సెంటర్‌ను పరిశీలించిన ఎస్పీ

image

రిక్రూట్ కానిస్టేబుళ్ల శిక్షణ త్వరలో ప్రారంభం కానున్న నేపథ్యంలో జిల్లా ఎస్పీ వీఎన్. మణికంఠ చందోలు శనివారం చిత్తూరు పోలీస్ ట్రైనింగ్ సెంటర్‌‌ను సందర్శించారు. ఎస్పీ బ్యారక్స్, డైనింగ్ హాల్, కిచెన్, వైద్య సదుపాయాలు, సీసీ కెమెరా పర్యవేక్షణ వంటి విభాగాలను సమగ్రంగా పరిశీలించారు. రిక్రూటర్లుకు పరిశుభ్ర వాతావరణం, తాగునీరు, ఆరోగ్య సదుపాయాలు, భద్రతా చర్యలు అత్యుత్తమంగా ఉండాలని తెలిపారు.

News September 6, 2025

VZM: ఉపాధ్యాయుల నియామకం కోసం ఇంటర్వ్యూలు

image

జవహర్ నవోదయ స్కూల్ ఉపాధ్యాయుల నియామకం కోసం JC ఛాంబర్‌లో శనివారం ఇంటర్వ్యూలు నిర్వహించారు. జేసీ సేతు మాధవన్, DEO మాణిక్యం నాయుడు, జవహర్ నవోదయ ప్రిన్సిపల్ దుర్గా ప్రసాద్, కేంద్రీయ విద్యాలయ ప్రిన్సిపల్ కమిటీ ఇంటర్వ్యూలను నిర్వహించింది. ఇంగ్లిష్, ఫిజిక్స్, మ్యాథ్స్ పోస్టుల కోసం ఇంటర్వ్యూలు జరిగాయి. ఒక సంవత్సర కాలానికి కాంట్రాక్ట్ విధానంలో పని చేయడానికి ఎంపికలు చేశారు.