News September 6, 2025

KNR: ‘రాగిజావ’ పథకం ఉన్నట్టా..? లేనట్టా..?

image

గ్రామీణ విద్యార్థులకు పౌష్టికాహారం అందాలనే లక్ష్యంతో రాగిజావ స్కీంను తెచ్చారు. రెండేళ్లుగా సాఫీగా సాగిన పథకం స్కూళ్లు ప్రారంభమై 3నెలలైనా ప్రభుత్వం నుంచి స్పందన లేదు. సత్యసాయి అన్నపూర్ణ ట్రస్ట్, ప్రభుత్వం ఈ స్కీంను సాగిస్తోంది. 10గ్రా. బెల్లం, 10గ్రా. రాగిపిండితో జావ ఇచ్చేందుకు ఒక్క విద్యార్థికి 25పైసల చొప్పున ఏజెన్సీకిచ్చేవారు. కాగా, రాష్ట్రంలో ఇప్పుడీ పథకముందా, రద్దయిందా అనే సంకట స్థితి నెలకొంది.

Similar News

News September 6, 2025

NLG: ‘తెలంగాణలో అందుకే యూరియా కొరత’

image

తెలంగాణలో గత నెల రోజులుగా రైతులను తీవ్రంగా వేధిస్తున్న యూరియా కొరతపై ఎంపీ కుందూరు రఘువీర్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. శుక్రవారం నల్గొండలో ఆయన ఓ మీడియా ఛానెల్‌తో మాట్లాడుతూ.. రైతులు వచ్చే సీజన్‌కు ముందస్తుగా నిల్వ చేసుకునేందుకే యూరియా కోసం క్యూలైన్లలో బారులు తీరుతున్నారని ఆరోపించారు. రఘువీర్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై రైతులు మండిపడుతున్నారు.

News September 6, 2025

తిరుపతి: పాప మిస్సింగ్ కేసులో బిగ్ ట్విస్ట్

image

తిరుపతి అలిపిరి పరిధిలో ఇవాళ తెల్లవారుజామున రమ్య(6 నెలలు) మిస్సింగ్ కేసులో బిగ్ ట్విస్ట్ చోటుచేసుకుంది. బహిర్భూమికి ఇద్దరు కుమార్తెలను తల్లి చందన తీసుకెళ్లింది. చందన చేతిలో నుంచి రమ్య జారి కాలువలో పడింది. బయటకు తీసుకొచ్చేందుకు ప్రయత్నం చేయగా ప్రయోజనం లేకపోవడంతో కుటుంబసభ్యులకు భయపడి కనిపించడంలేదని తెలిపినట్లు సమాచారం.

News September 6, 2025

కొత్తపట్నం వద్ద విషాదం.. స్పందించిన మంత్రి!

image

కొత్తపట్నం మండలం గుండమాల తీరం వద్ద శనివారం మోటుమాల గ్రామానికి చెందిన నాగరాజు, బాలచందర్ మృతి చెందడంపై మంత్రి స్వామి దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు. గుండమాల తీరం వద్ద నిమజ్జనోత్సవం సందర్భంగా వీరు మృతి చెందినట్లు సమాచారం అందుకున్న, మంత్రి స్వామి వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు. నిమజ్జనం సమయంలో భక్తులు స్వీయ జాగ్రత్తలు పాటించాలని మంత్రి కోరారు.