News September 6, 2025

నేడు ఈ వ్రతం చేస్తే సకల శుభాలు

image

కష్టాల నుంచి విముక్తి పొంది సకల శుభాలు కలగాలంటే నేడు అనంత పద్మనాభ వ్రతం చేయాలని పండితులు చెబుతున్నారు. భాద్రపద శుద్ధ చతుర్దశినాడు ఈ వ్రతాన్ని ఆచరిస్తే పుణ్య ఫలాలు లభిస్తాయని అంటున్నారు. ‘శ్రీకృష్ణుడే స్వయంగా ఈ వ్రతం గురించి పాండవులకు చెప్పారు. ఈ వ్రతాన్ని ఆచరించిన వారికి సంపదలు కలుగుతాయి. ఈ పవిత్ర వ్రతాన్ని ఆచరించి, అనంత పద్మనాభుని కృపకు పాత్రులైతే అంతర్గత శాంతి లభిస్తుంది’ అని సూచిస్తున్నారు.

Similar News

News February 3, 2026

ఫిబ్రవరి 03: చరిత్రలో ఈ రోజు

image

☛ 1468: అచ్చుయంత్రాన్ని కనుగొన్న జోహన్నెస్ గుటెన్‌బర్గ్ మరణం
☛ 1924: అమెరికా మాజీ అధ్యక్షుడు, నోబెల్ బహుమతి గ్రహీత ఉడ్రోవిల్సన్ మరణం.
☛ 1938: బాలీవుడ్ నటి వహీదా రెహమాన్ జననం
☛ 1963: RBI 23వ గవర్నర్‌ రఘురాం రాజన్ జననం
☛ 2002: ప్రముఖ సంగీత దర్శకుడు కె.చక్రవర్తి మరణం(ఫొటోలో)
☛ నేడు జాతీయ మహిళా వైద్యుల దినోత్సవం

News February 3, 2026

ప్రీమియం ఫోన్ల వైపు ఇండియన్స్.. వాల్యూ షేర్‌లో ఐఫోన్ టాప్

image

భారత స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లో యాపిల్ రికార్డు సృష్టించింది. 2025లో ఏకంగా 28% వాల్యూ షేర్‌ను దక్కించుకుని అగ్రస్థానంలో నిలిచింది. ఇండియన్స్ ప్రీమియం ఫోన్ల వైపు మొగ్గు చూపుతుండటమే దీనికి కారణమని కౌంటర్ పాయింట్ రీసెర్చ్ వెల్లడించింది. ఐఫోన్ 16 సిరీస్ సక్సెస్‌, ఈజీ ఫైనాన్స్, ఎక్స్ఛేంజ్ ఆఫర్లు యాపిల్‌కు కలిసొచ్చాయి. వాల్యూమ్ పరంగా భారత స్మార్ట్‌ఫోన్ మార్కెట్ 1%, విలువ పరంగా 8% పెరిగింది.

News February 3, 2026

పుట్టినరోజు శుభాకాంక్షలు

image

ఈ రోజు పుట్టినరోజు జరుపుకొంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపర్చండి.