News September 6, 2025
విష్ణువు దశావతారాలు ఎందుకు ఎత్తారు? (1/2)

దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ కోసం విష్ణువు దశావతారాలు ఎత్తారు. సృష్టి ప్రళయానికి గురైనప్పుడు, వేదాలను కాపాడేందుకు మత్స్య రూపంలో వచ్చారు. క్షీరసాగర మథన సమయంలో మందరగిరిని మోయడానికి తాబేలు అవతారంలో వచ్చారు. భూమిని కాపాడేందుకు వరాహ రూపం, భక్త ప్రహ్లాదుణ్ని కాపాడి, హిరణ్యకశిపుణ్ని చంపేందుకు నరసింహుని రూపం ఎత్తారు. బలి చక్రవర్తి అహంకారాన్ని అణిచి లోకాలను అధీనంలోకి తెచ్చుకోవడానికి వామనుడిగా వచ్చారు.
Similar News
News September 6, 2025
GST ఎఫెక్ట్.. ఫార్చునర్‌పై రూ.3.49 లక్షల తగ్గింపు

జీఎస్టీ శ్లాబుల మార్పుల వేళ <<17624320>>టాటా<<>>, మహీంద్రా బాటలోనే టొయోటా కూడా కార్ల ధరలను తగ్గిస్తున్నట్లు ప్రకటించింది. ఫార్చునర్‌పై అత్యధికంగా రూ.3.49లక్షల వరకు తగ్గనున్నట్లు తెలిపింది. గ్లాంజాపై రూ.85,300 వరకు, టైసోర్‌పై రూ.1.11 లక్షల వరకు, ఇన్నోవా క్రిస్టాపై రూ.1.8లక్షల వరకు, హైలక్స్‌పై రూ.2.52లక్షల వరకు, వెల్‌ఫైర్‌పై రూ.2.78లక్షల వరకు ధర తగ్గిస్తున్నట్లు పేర్కొంది. ఇవి ఈనెల 22 నుంచి అమల్లోకి వస్తాయంది.
News September 6, 2025
మాక్రాన్‌కు మోదీ ఫోన్.. వివిధ అంశాలపై చర్చ

ప్రపంచ శాంతి కోసం భారత్-ఫ్రాన్స్ కలిసి పనిచేస్తాయని ప్రధాని మోదీ పునరుద్ఘాటించారు. ఆ దేశ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్‌తో ఫోన్‌లో సంభాషించినట్లు తెలిపారు. ఇరుదేశాల మధ్య ద్వైపాక్షిక సహకారం కొనసాగడంపై చర్చించినట్లు చెప్పారు. అంతర్జాతీయ అంశాలతో పాటు ఉక్రెయిన్ యుద్ధం ముగింపునకు చేపట్టాల్సిన అంశాలపైనా సుదీర్ఘంగా మాట్లాడినట్లు మోదీ వెల్లడించారు.
News September 6, 2025
రాష్ట్రపతి ముర్ముతో ప్రధాని మోదీ భేటీ

రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ముతో ప్రధాని మోదీ భేటీ అయ్యారు. రాష్ట్రపతి భవన్‌కు వెళ్లిన ఆయన ఈ నెల 9న జరగనున్న ఉప రాష్ట్రపతి ఎన్నిక, ఇతర అంశాల గురించి చర్చించినట్లు తెలుస్తోంది. భేటీకి సంబంధించిన పూర్తి వివరాలు కాసేపట్లో వెల్లడయ్యే అవకాశం ఉంది.