News September 6, 2025
క్రేన్ నం.4 వద్ద ఖైరతాబాద్ గణేశుడి నిమజ్జనం

ఖైరతాబాద్ బడా గణేశుడి శోభాయాత్ర భారీ భద్రత మధ్య అట్టహాసంగా కొనసాగుతోంది. ఈ ఊరేగింపును చూసేందుకు వచ్చిన భక్తులతో నగరం సంద్రాన్ని తలపిస్తోంది. ట్యాంకు బండ్‌పై క్రేన్ నం.4 వద్ద అధికారులు నిమజ్జనం బడాగణేశ్‌ను గంగమ్మఒడికి చేర్చనున్నారు. భక్తులు భారీగా చేరుకుంటుండంటంతో మరింత ఆలస్యం అయ్యే అవకాశం ఉందని నిర్వహకులు చెబుతున్నారు.
Similar News
News September 6, 2025
గంగ ఒడికి బాలాపూర్ గణేశుడు

బాలాపూర్ గణేశుడు గంగ ఒడికి చేరాడు. ఉదయం మండపం నుంచి మొదలైన భారీ శోభాయాత్ర చార్మినార్, MJ మార్కెట్ మీదుగా అప్పర్ ట్యాంక్‌బండ్‌కు చేరుకొంది. సాయంత్రం 6:15 నిమిషాలకు క్రేన్ నంబర్ 12 వద్దకు చేరుకోగా విగ్రహానికి ఉత్సవ సమితి సభ్యులు పూజలు చేశారు. సాయంత్రం 6:30 గంటలకు సాగర్‌లో బాలాపూర్ గణేశుడిని నిమజ్జనం సంపూర్ణమైంది.
News September 6, 2025
ట్యాంక్‌బండ్‌లో నిమజ్జనం.. ఏరియల్ వ్యూ

నగరంలో గణేశ్ నిమజ్జన కార్యక్రమం సజావుగా సాగుతోందని నిర్ధారించుకునేందుకు అధికారులు ఏరియల్ వ్యూ ద్వారా పర్యవేక్షించారు. బేగంపేట విమానాశ్రయం నుంచి నిమజ్జన సరళిని మంత్రి పొన్నం ప్రభాకర్, మేయర్ గద్వాల విజయలక్ష్మీ, డీజీపీ జితేందర్, హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్, జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వీ కర్ణన్, కలెక్టర్ దాసరి హరిచందన సమీక్షించారు.
News September 6, 2025
HYD: రేపు ఉ.10 గం.కు రోడ్లు ఓపెన్!

రేపు ఉ.10 గంటలలోపు హుస్సేన్‌సాగర్ చుట్టుపక్కల రహదారులపై జనరల్ ట్రాఫిక్ అనుమతించడానికి ప్రయత్నిస్తామని HYD సీపీ ఆనంద్ తెలిపారు. అలాగే నెక్లెస్ రోడ్‌పై విగ్రహాలు ఉన్న వాహనాలను నాలుగు వరుసలలో ఉంచి, రేపు రాత్రి వరకు నిమజ్జనం పూర్తి చేస్తామని పేర్కొన్నారు. HYD వ్యాప్తంగా 29,000 మంది పోలీసులు నిర్విరామంగా కృషి చేస్తున్నారన్నారు.