News September 6, 2025
దంపతుల గుండె పగిలేలా చేసిన ప్రమాదం

ఒక్కగానొక్క బిడ్డ. మళ్లీ పిల్లలు పుట్టే అవకాశం లేకపోవడంతో <<17627461>>అల్లారుముద్దుగా<<>> పెంచుకున్నారు. కష్టం దరిచేరకుండా కంటికి రెప్పలా కాపాడుకున్నారు. కానీ విధి వారి ఆశల్ని చిదిమేసింది. సూళ్లూరుపేట(M) అబాక హరిజనవాడలో రోటవేటర్‌లో పడి ఇద్దరు చిన్నారులు చనిపోయిన విషయం తెలిసిందే. కృష్ణయ్య చిన్న కుమారుడు, కోడలికి దివాన్(3) ఒక్కడే బిడ్డ. ఆ పిల్లాడి మృతితో దంపతులు గుండెలు పగిలేలా విలపించారు.
Similar News
News September 6, 2025
రైతు సేవా కేంద్రాలలో అందుబాటులో యూరియా: కలెక్టర్

నెల్లూరు జిల్లాలో 2471 మెట్రిక్ టన్నుల యూరియా అందుబాటులో ఉందని కలెక్టర్ ఆనంద్ తెలిపారు. రాబోయే పది రోజులలో 500 మెట్రిక్ టన్నుల యూరియా జిల్లాకు చేరుతుందని అన్నారు. రైతు సేవా కేంద్రాలలో యూరియా అందుబాటులో ఉంటుందని పేర్కొన్నారు. ఆధార్ అధికృత విధానం ద్వారా యూరియా పంపిణీ జరుగుతుందన్నారు. యూరియా సరఫరాలో లేదా ధరలలో ఫిర్యాదులు ఉంటే 8331057285 టోల్ ఫ్రీ నంబర్‌ను సంప్రదించాలని కోరారు.
News September 6, 2025
నెల్లూరు: స్మార్ట్ రేషన్ కార్డులో తప్పులు!

చేజర్ల(M) ఆదురుపల్లిలో స్మార్ట్ రేషన్ కార్డుల్లో పొరపాట్లు బయటపడ్డాయి. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా ప్రారంభించిన స్మార్ట్ కార్డులలో వయస్సు, ఇంటిపేర్లలో లోపాలు నమోదయ్యాయి. పఠాన్ ఆఫిఫా తవస్సు వయసు 14 ఉండగా 18 ఏళ్లుగా నమోదు కాగా, కొందరి ఇంటిపేర్లు షేక్ స్థానంలో షైక్‌గా నమోదయ్యాయి. పొరపాట్లను వెంటనే సరిచేయాలని బాధితులు కోరుతున్నారు. మీ స్మార్ట్ కార్డులలో కూడా ఇలానే ఉంటే కామెంట్ చేయండి.
News September 6, 2025
విషాదం.. ట్రాక్టర్ కింద పడి ఇద్దరు చిన్నారుల మృతి

సుళ్లూరుపేట(M)లో శుక్రవారం విషాదం చోటు చేసుకుంది. ట్రాక్టర్ కింద పడి ఇద్దరు చిన్నారులు ప్రాణాలు విడిచారు. స్థానికుల సమాచారం మేరకు.. అబాక హరిజనావాడకు చెందిన A.కృష్ణయ్య పొలానికి ట్రాక్టర్‌పై వెళుతుండగా ‘మేము వస్తాం’ అంటూ ఇద్దరు మనమరాళ్లు, మనవడు మారం చేశారు. దీంతో చేసేది లేక ఆయన వారిని తీసుకుని బయలుదేరాడు. పొలాన్ని దున్నుతుండగా ప్రమాదవశాత్తు రోటవేటర్ కింద పడి కుందన(11), దివాన్ (3) చనిపోయారు.