News September 6, 2025
పిల్లలకు ఫోన్ ఇస్తున్నారా? పెద్ద తప్పు చేస్తున్నారు!

పిల్లల ఏడుపును మాన్పించేందుకు, ఆహారం తినిపించేందుకు కొందరు వారికి ఫోన్ ఇస్తుంటారు. కొందరైతే తమ పిల్లలు సొంతగా యూట్యూబ్ వాడితే ఖుషీ అవుతుంటారు. కానీ పిల్లలకు ఫోన్ ఇవ్వడం మంచిది కాదని మానసిక వైద్యుడు శ్రీకాంత్ అంటున్నారు. ‘పిల్లల మెదడు ఎంత మొబైల్ చూస్తే అంత మొద్దుబారుతుంది. ఇంట్లో ఎన్ని తక్కువ బొమ్మలుంటే అంత చురుకవుతుంది. పేరెంట్స్ ఎన్ని మాటలు, కథలు చెప్తే అంత పదునవుతుంది’ అని తెలిపారు.
Similar News
News September 6, 2025
GREAT: 20లక్షల పుస్తకాలతో లైబ్రరీ

పుస్తకాలు సేకరించే అభిరుచిని ప్రజా ప్రయోజనంగా మార్చారు కర్ణాటకలోని హరలహల్లికి చెందిన అంకే గౌడ. బస్ కండక్టర్‌గా జీవితాన్ని ప్రారంభించి సాహిత్యంలో మాస్టర్స్ పూర్తి చేశారు. పుస్తకాల సేకరణకు తన ఆస్తిని కూడా అమ్మేశారు. ప్రస్తుతం ఆయన 20లక్షల పుస్తకాలతో వ్యక్తిగత లైబ్రరీని ఏర్పాటు చేయగా అందులో 5లక్షల విదేశీ పుస్తకాలు, వివిధ భాషలకు చెందిన 5K నిఘంటువులు ఉన్నాయి. ఈ లైబ్రరీకి న్యాయమూర్తులు సైతం వెళ్తుంటారు.
News September 6, 2025
రేపు తిరుమల శ్రీవారి ఆలయం మూసివేత

AP: చంద్రగ్రహణం సందర్భంగా రేపు తిరుమల శ్రీవారి ఆలయం మూసివేస్తున్నట్లు TTD అదనపు ఈవో వెంకయ్య చౌదరి తెలిపారు. ‘మ.3.30గంటలకు ఆలయం మూసివేస్తాం. ఎల్లుండి సుప్రభాత సేవతో ఆలయ తలుపులు తెరుస్తాం. మధ్యాహ్నంలోపు 30వేల మందికి దర్శనం కల్పిస్తాం. రేపు వీఐపీ బ్రేక్ దర్శనాలు, ఆర్జిత సేవలు రద్దు’ అని చెప్పారు. అలాగే శ్రీశైలం ఆలయం కూడా రేపు మధ్యాహ్నం ఒంటి గంట నుంచి మూసివేయనున్నారు.
News September 6, 2025
ఫైనల్‌కు దూసుకెళ్లిన భారత ఆర్చర్లు

సౌత్ కొరియాలో జరుగుతున్న ఆర్చరీ ఛాంపియన్ షిప్‌లో భారత ఆర్చర్లు వెన్నం సురేఖ, రిషభ్ యాదవ్ సత్తా చాటారు. సెమీ ఫైనల్‌లో కాంపౌండ్ మిక్స్‌డ్ టీమ్ విభాగంలో చైనీస్ తైపీ జట్టుపై గెలిచి ఫైనల్‌కు దూసుకెళ్లారు. చైనీస్ తైపీపై 157-155 పాయింట్ల తేడాతో నెగ్గారు. ఫైనల్లో నెదర్లాండ్స్‌ను వీరు ఎదుర్కొంటారు.