News April 3, 2024
తగ్గిపోతున్న ఉద్యోగ ఆఫర్లు.. విద్యార్థుల ఆందోళన!

ఐఐటీల్లో చదివితే జాబ్ గ్యారంటీ అని చాలా మంది భావిస్తుంటారు. అయితే IIT బాంబేలో ఈ ఏడాది 36% మందికి జాబ్ రాకపోవడం చర్చనీయాంశంగా మారింది. గత ఏడాదితో పోలిస్తే ప్లేస్మెంట్ దొరకని విద్యార్థుల సంఖ్య 2.8% పెరిగింది. దీంతో IITలో చదివిన వారి పరిస్థితే ఇలా ఉంటే ఇతర ఇన్స్టిట్యూట్స్లో చదివే వారి పరిస్థితేంటని, నిరుద్యోగ రేటు పెరుగుతోందని పలువురు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
Similar News
News January 22, 2026
IIFCLలో ఉద్యోగాలకు దరఖాస్తుల ఆహ్వానం

<
News January 22, 2026
అనిల్ రావిపూడి కొత్త సినిమాలో ఇద్దరు హీరోలు?

వరుస హిట్ సినిమాలతో జోరు మీదున్న డైరెక్టర్ అనిల్ రావిపూడి తన తర్వాతి సినిమాను మల్టీస్టారర్గా తెరకెక్కించనున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇందులో దగ్గుబాటి హీరోలు వెంకటేశ్, రానా కలిసి నటిస్తారని టాక్ వినిపిస్తోంది. 2027 సంక్రాంతికి మూవీ రిలీజయ్యే అవకాశముందని సినీవర్గాలు చెబుతున్నాయి. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. వెంకీ, రానా గతంలో ‘రానా నాయుడు’ సిరీస్లో కలిసి నటించిన సంగతి తెలిసిందే.
News January 22, 2026
హత్యారాజకీయాలతో విషబీజాలు నాటుతున్న CBN: జగన్

AP: హత్యా రాజకీయాలను ప్రోత్సహిస్తూ CBN నాటుతున్న విషబీజాలు చెట్లుగా మారి కంట్రోల్ కాని పరిస్థితులు వస్తాయని జగన్ హెచ్చరించారు. ‘ఇళ్లు, ఆస్తులు వదిలి ఊళ్లు వదిలి వెళ్లిపోయేలా YCP వారిపై కూటమి నేతలు దౌర్జన్యాలు చేస్తున్నారు. మా కార్యకర్తలను చంపేస్తున్నారు. బాధిత కుటుంబాలు రేపు చూస్తూ ఊరుకుంటాయా? పోలీసులు, MLAలు, CBN బాధ్యత వహించకతప్పదు’ అని పేర్కొన్నారు. పాలకులన్నవారు జాగ్రత్తగా వ్యవహరించాలన్నారు.


