News September 6, 2025
రేపు కామారెడ్డిలో ముఖ్య కార్యకర్తల సమావేశం: షబ్బీర్ ఆలీ

రేపు కామారెడ్డిలో ఉమ్మడి నిజామాబాద్ జిల్లా కాంగ్రెస్ ముఖ్య నాయకులు, కార్యకర్తల సమావేశం నిర్వహిస్తున్నట్లు ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షబ్బీర్ తెలిపారు. ఎన్నికల్లో బీసీ డిక్లరేషన్ ప్రకటించిన వేదిక పైనే, అసెంబ్లీలో తీర్మానం చేసి దాన్ని అమలు చేసుకుని సంబరాలు చేసుకుంటున్నట్లు చెప్పారు. ఈనెల 15న కామారెడ్డిలో బహిరంగ సభ నిర్వహించనున్న నేపథ్యంలో రేపు సన్నాహక సమావేశం ఉంటుందని పేర్కొన్నారు.
Similar News
News September 6, 2025
MHBD: కమ్యూనిటీ మీడియేటర్లు చురుకైన పాత్ర పోషించాలి: జడ్జి

కమ్యూనిటీ వివాదాలను పరిష్కరించడంలో చురుకైన పాత్ర పోషించాలని MHBD ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి స్వాతి మురారి పిలుపునిచ్చారు. తెలంగాణ రాష్ట్ర న్యాయసేవాధికార సంస్థ హైదరాబాద్ వారి ద్వారా మీడియేషన్‌లో నిపుణులైన న్యాయ కోవిదుల ద్వారా 3 రోజుల శిక్షణ పొందిన కమ్యూనిటీ మీడియేటర్లు తమ వద్దకు వచ్చారన్నారు. మీడియేటర్ల శిక్షణ ముగిసి చాలా కాలమైనప్పటికీ ఇంకా జిల్లాలో మీడియేషన్ సెంటర్లు ఏర్పాటు కాలేదన్నారు.
News September 6, 2025
MHBD: యూరియా బస్తాను ఎత్తిన జిల్లా ఎస్పీ

మహబూబాబాద్ జిల్లాలో యూరియా పంపిణీ భారాన్ని పోలీసులు భుజానికెత్తుకున్నారు. జిల్లా కేంద్రంలోని ప్రాథమిక సహకార సంఘం సొసైటీ వద్ద ఈరోజు యూరియా పంపిణీని మహబూబాబాద్ జిల్లా ఎస్పీ సుధీర్ రాంనాథ్ కేకన్ పర్యవేక్షించారు. ఓ మహిళా రైతుకు యూరియా బస్తాను ఆమె భుజానికి ఎత్తారు. రైతులకు సహాయం చేస్తూ పోలీస్ అధికారులు, సిబ్బంది ప్రశంసలు అందుకుంటున్నారు.
News September 6, 2025
అడ్మిషన్లకు నోటిఫికేషన్ విడుదల

APలో LAWCET, PGLCET, EdCET, PECETలో అడ్మిషన్లకు నోటిఫికేషన్ విడుదలైంది. LAWCET, PGLCETకు ఈనెల 8-11 మధ్య దరఖాస్తు ఫీజు చెల్లించాలి. 12-14 మధ్య వెబ్ ఆప్షన్స్, 17న సీట్ల కేటాయింపు చేపడతారు. EdCETకు 9-12 మధ్య ఫీజు చెల్లింపు, 13-15 మధ్య వెబ్ ఆప్షన్స్, 18న సీట్ అలాట్‌మెంట్ ఉంటుంది. PECETకు 10-13 మధ్య ఫీజు చెల్లింపు, 14-16 మధ్య వెబ్ ఆప్షన్స్, 19న సీట్ల కేటాయింపు ఉంటుంది. పూర్తి వివరాలకు <