News September 6, 2025

PDPL: 9వ సారి లడ్డూ దక్కించుకున్న యువకుడు

image

పెద్దపల్లి జిల్లా ధర్మారం మండల కేంద్రంలోని గణేష్ నగర్‌లో నెలకొల్పిన మహాగణపతి లడ్డూను చింతపండు సాయి చరణ్, ప్రమోదిని దంపతులు వేలం ద్వారా రూ.75 వేలకు దక్కించుకున్నారు. అయితే ఆ లంబోదరుడి మహాప్రసాదాన్ని సాయి చరణ్ వరుసగా తొమ్మిదోసారి దక్కించుకోవడం విశేషం. ఇందుకు ఆ దంపతులు ఆనందం వ్యక్తం చేశారు. అలాగే మండపంలోని ప్రధాన కలశాన్ని రూ.25వేలకు సిగిరి లచ్చయ్య దక్కించుకున్నారు.

Similar News

News September 6, 2025

VZM: యూరియా పంపిణీపై కలెక్టర్ కీలక ప్రకటన

image

ప్ర‌స్తుతం విజయనగరం జిల్లాలో 1,122 మెట్రిక్ ట‌న్నుల యూరియా RSK, ప్ర‌యివేటు వ‌ర్త‌కుల వ‌ద్దా సిద్ధంగా ఉంద‌ని కలెక్టర్ అంబేడ్కర్ శనివారం తెలిపారు. సోమ‌వారం మ‌రో 850 ట‌న్నులు, గురువారం 1,000 ట‌న్నులు యూరియా జిల్లాకు రానుంద‌ని పేర్కొన్నారు. ఇది కాకుండా ఈ నెలాఖ‌రుకి మ‌రో 3,000 మెట్రిక్ ట‌న్నుల యూరియా వ‌స్తుంద‌ని వెల్లడించారు. రైతులు షాపులవ‌ద్ద గంట‌ల త‌ర‌బ‌డి క్యూల్లో నిల్చోవాల్సిన అవ‌స‌రం లేద‌న్నారు.

News September 6, 2025

పెదఅమిరం: ఆధార్ బయోమెట్రిక్ ప్రక్రియ వేగవంతం చేయాలి

image

కౌశలం సర్వే, పిల్లల ఆధార్ బయోమెట్రిక్ అప్డేషన్, ఈపీటీఎస్ ఫైల్స్ అప్లోడింగ్ ప్రక్రియ వేగవంతంగా పూర్తి చేయాలని కలెక్టర్ నాగరాణి అన్నారు. శనివారం పెద అమిరంలోని కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో మున్సిపల్ కమిషనర్లు, ఎంపీడీవోలతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. తల్లికి వందనం ఖాతాలో నగదు జమకు ఉన్న ఆటంకాలను పరిష్కరించాలన్నారు. పిల్లలందరికీ ఆధార్ బయోమెట్రిక్ ను అప్డేట్ చేయాలని సూచించారు.

News September 6, 2025

MHBD: కమ్యూనిటీ మీడియేటర్లు చురుకైన పాత్ర పోషించాలి: జడ్జి

image

కమ్యూనిటీ వివాదాలను పరిష్కరించడంలో చురుకైన పాత్ర పోషించాలని MHBD ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి స్వాతి మురారి పిలుపునిచ్చారు. తెలంగాణ రాష్ట్ర న్యాయసేవాధికార సంస్థ హైదరాబాద్ వారి ద్వారా మీడియేషన్‌లో నిపుణులైన న్యాయ కోవిదుల ద్వారా 3 రోజుల శిక్షణ పొందిన కమ్యూనిటీ మీడియేటర్లు తమ వద్దకు వచ్చారన్నారు. మీడియేటర్ల శిక్షణ ముగిసి చాలా కాలమైనప్పటికీ ఇంకా జిల్లాలో మీడియేషన్ సెంటర్లు ఏర్పాటు కాలేదన్నారు.