News September 6, 2025

ADB: వినాయక నిమజ్జనం.. అందుబాటులో 108 సేవలు

image

ఆదిలాబాద్ జిల్లాలో గణేష్ నిమజ్జనోత్సవం సందర్భంగా అత్యవసర పరిస్థితులను ఎదుర్కొనేందుకు పలుచోట్ల 108 అంబులెన్సులను అందుబాటులో ఉంచినట్లు జిల్లా ఇన్‌ఛార్జీ రాజశేఖర్, సామ్రాట్ తెలిపారు. ఆదిలాబాద్‌లోని వన్‌టౌన్ పోలీస్ స్టేషన్, కిసాన్ చౌక్, చందా, పెన్‌గంగాతో పాటు ఉట్నూర్, బోథ్, ఇచ్చోడ, గుడిహత్నూర్‌లో 108 సిబ్బంది 24 గంటల పాటు అందుబాటులో ఉంటారని వారు పేర్కొన్నారు.

Similar News

News September 6, 2025

ADB: మహా నిమజ్జనం వేళ మానవత్వం చాటుకుందాం

image

ఆదిలాబాద్ జిల్లాలో నేడు 450 గణేష్ విగ్రహాల నిమజ్జనం జరగనుంది. వీటిలో దాదాపు 50 శాతం విగ్రహాల వద్ద బ్యాండ్లను ఏర్పాటు చేశారు. బ్యాండ్ వాయించేవారు అలసిపోయినప్పుడు వారికి కొద్దిగా విశ్రాంతి ఇవ్వడం, మంచి నీరు, ఆహారం అందించడం ద్వారా నిర్వాహకులు మానవత్వాన్ని చాటుకోవాలని సామాజికవేత్తలు కోరారు. వారిని ఇబ్బంది పెట్టకుండా తోటి మానవులుగా ఆదరించాలని విజ్ఞప్తి చేశారు.

News September 6, 2025

ADB: ఐదుగురు ఆకతాయిలపై కేసు నమోదు

image

మహిళలను వేధిస్తున్న ఐదుగురు ఆకతాయిలపై కేసు నమోదు చేసినట్లు షీటీం ఇన్‌ఛార్జ్ ASI సుశీల తెలిపారు. గణపతి నవరాత్రి ఉత్సవాల్లో మహిళల భద్రతకు షీటీం స్పెషల్ ఆపరేషన్ నిర్వహించామన్నారు. ఈ మేరకు మహిళలను వేధిస్తూ రెడ్ హ్యాండెడ్‌గా ఐదుగురిని పట్టుకున్నామన్నారు. వీరిలో మయూర్, సిద్దు, కార్తీక్, గణేష్, వినాయక్‌పై 1 టౌన్‌లో కేసు నమోదు చేసినట్లు చెప్పారు. మహిళలు అత్యవసర సమయంలో 8712659953కు కాల్ చేయాలని సూచించారు.

News September 6, 2025

ADB: నేడు 450 వినాయక విగ్రహాల నిమజ్జనం

image

జిల్లావ్యాప్తంగా రెండు వేల గణపతి విగ్రహాలను ప్రతిష్ఠించినట్లు ఎస్పీ అఖిల్ మహాజన్ తెలిపారు. ఇప్పటి వరకు దాదాపు జిల్లావ్యాప్తంగా 1500 గణపతుల నిమర్జనాలు విజయవంతంగా పూర్తి చేసుకున్నాయని పేర్కొన్నారు. శనివారం 450 గణపతి విగ్రహాల నిమజ్జనం ఉందని పేర్కొన్నారు. చివరి గణపతి నిమర్జనం పూర్తి అయ్యే వరకు జిల్లా పోలీసు యంత్రాంగం అప్రమత్తతోనే వ్యవహరిస్తుందని తెలిపారు.