News September 6, 2025

కామారెడ్డిలో కాంగ్రెస్ బీసీ డిక్లరేషన్ సభ

image

కామారెడ్డిలో కాంగ్రెస్ పార్టీ భారీ బహిరంగ సభకు ఏర్పాట్లు చేస్తోంది. ఈ నెల 15న జరగనున్న ఈ సభలో బీసీ డిక్లరేషన్‌ అమలు, అసెంబ్లీలో 42% రిజర్వేషన్లపై తీర్మానం చేసిన సందర్భంగా సంబరాలు జరుపుకోనున్నారు. ఈ సభలో రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గే, సీఎం రేవంత్ రెడ్డి పాల్గొనే అవకాశం ఉంది. ఈ సభకు సంబంధించిన సన్నాహక సమావేశం ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షబ్బీర్ నివాసంలో శనివారం జరిగింది.

Similar News

News September 6, 2025

SBIలో 6,589 జాబ్స్.. పరీక్షల తేదీ ప్రకటన

image

6,589 క్లర్క్(జూనియర్ అసోసియేట్స్) పోస్టుల భర్తీకి ఈనెల 20, 21, 27 తేదీల్లో ప్రిలిమ్స్ నిర్వహించనున్నట్లు SBI ప్రకటించింది. త్వరలో కాల్ లెటర్లు విడుదల చేయనున్నట్లు తెలిపింది. కాగా AUG 26 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు స్వీకరించింది. మొత్తం పోస్టుల్లో 5,180 రెగ్యులర్, 1,409 బ్యాక్‌లాగ్ ఉద్యోగాలున్నాయి. వీటిలో APలో 310, TGలో 250 పోస్టులు ఖాళీగా ఉన్నాయి.
వెబ్‌సైట్: <>sbi.co.in/web/careers<<>>

News September 6, 2025

మెదక్: 24 గంటల్లో 110 గ్రామాలకు విద్యుత్ పునరుద్ధరణ: సీఈ

image

జిల్లా వ్యాప్తంగా ఆగస్టు 26 నుంచి 30వ తేదీ వరకు కురిసిన భారీ వర్షాల కారణంగా నిలిచిపోయిన విద్యుత్ సరఫరాను 24 గంటల్లోపే 110 గ్రామాలకు పునరుద్ధరించినట్లు చీఫ్ ఇంజినీర్ బాలస్వామి తెలిపారు. జిల్లా పరిధిలోని మొత్తం 115 గ్రామాలకు విద్యుత్ సరఫరా నిలిచిపోగా, అధికారులు వెంటనే స్పందించి ఎస్‌ఈ నుంచి కింది స్థాయి సిబ్బంది వరకు తమ బాధ్యతలను నిర్వర్తించారని ఆయన పేర్కొన్నారు.

News September 6, 2025

నంద్యాల జిల్లాలో యూరియా కొరత లేదు: మంత్రి ఫరూక్

image

నంద్యాల జిల్లాలో ఎటువంటి యూరియా కొరత లేదని మంత్రి ఫరూక్ పేర్కొన్నారు. జిల్లాకు రెండు రోజులలో 5,200 యూరియా వచ్చిందన్నారు. యురియాను జిల్లాలోని 162 రైతు సేవా కేంద్రాలకు 3,245 మెట్రిక్ టన్నుల యూరియా మార్క్‌ఫెడ్ ద్వారా సరఫరా చేస్తున్నామన్నారు. యూరియా సరఫరాపై రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. రైతులకు అవసరమైన యురియాను కూటమి ప్రభుత్వం అందజేస్తుందన్నారు.