News September 6, 2025

కేటీఆర్ భద్రాచలం పర్యటన వాయిదా: BRS

image

బీఆర్‌ఎస్‌ వర్కింగ్ ప్రెసిడెంట్ KTR భద్రాచలం పర్యటన వాయిదా పడినట్లు బీఆర్‌ఎస్‌ నియోజకవర్గ నాయకుడు రావులపల్లి రామ్‌ప్రసాద్ తెలిపారు. సెప్టెంబర్ 10, 11న భద్రాచలంలో జరగాల్సిన కేటీఆర్ పర్యటన అనివార్య కారణాలతో వాయిదా పడిందని, తదుపరి పర్యటన వివరాలను త్వరలోనే ప్రకటిస్తామని తెలిపారు. ఈ విషయాన్ని పార్టీ నాయకులు, కార్యకర్తలు గమనించాలని సూచించారు.

Similar News

News September 6, 2025

మిథున్ రెడ్డిని కలిసిన మాజీ ఎమ్మెల్యేలు

image

మధ్యంతర బెయిల్‌పై శనివారం రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి విడుదలైన రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డిని మాజీ ఎమ్మెల్యేలు తలారి వెంకటరావు, సత్తి సూర్యనారాయణ రెడ్డి, జగ్గిరెడ్డి శనివారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ కార్యక్రమంలో వైసీపీ తూర్పుగోదావరి జిల్లా మాజీ ప్రచార కమిటీ అధ్యక్షుడు తోట రామకృష్ణ, ఇతర జిల్లా ముఖ్య నాయకులు కూడా పాల్గొన్నారు.

News September 6, 2025

చరిత్ర సృష్టించిన సికందర్ రజా

image

జింబాబ్వే క్రికెటర్ సికందర్ రజా సరికొత్త చరిత్ర సృష్టించారు. టీ20 ఫార్మాట్‌(టెస్టులు ఆడే దేశాలు)లో అత్యధిక POTMలు అందుకున్న ప్లేయర్‌గా రజా నిలిచారు. ఇప్పటివరకు ఆయన 18 ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డులు అందుకున్నారు. శ్రీలంకతో జరిగిన రెండో టీ20లో ఆయన POTMగా నిలిచి ఈ ఫీట్ సాధించారు. రజా తర్వాత కోహ్లీ, సూర్యకుమార్(16), మహమ్మద్ నబీ, రోహిత్(14), మహ్మద్ రిజ్వాన్, వార్నర్, మ్యాక్స్‌వెల్ (12) ఉన్నారు.

News September 6, 2025

ఏలూరు: ఛార్టర్డ్ అకౌంటెంట్ల నియామకానికి దరఖాస్తుల ఆహ్వానం

image

ఏలూరు జిల్లా నీటి యాజమాన్య సంస్థ 2024-25 అభివృద్ధి పనుల్లో భాగంగా ఉపాధి హామీ పథకం అమలు, అకౌంట్ల ఆడిట్ కోసం ఛార్టర్డ్ అకౌంటెంట్ల నియామకానికి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆసక్తి గల వారు దరఖాస్తులు, అర్హత పత్రాలను 12వ తేదీ సాయంత్రం 5 లోపు ఏలూరు ప్రాజెక్టు డైరెక్టర్‌కు పంపాలని ప్రాజెక్ట్ డైరెక్టర్ రఘుబాబు తెలిపారు.