News September 6, 2025

జయజయధ్వానాల నడుమ గంగమ్మ ఒడికి గణపయ్య

image

ఖైరతాబాద్ గణేశ్ నిమజ్జనం మొదలైంది. గణపతి బప్పా మోరియా జయజయధ్వానాల నడుమ క్రేన్ సాయంతో గణపయ్యను గంగమ్మ ఒడికి చేర్చుతున్నారు. ట్యాంక్ బండ్ పరిసరాలు గణపయ్య నామ స్మరణతో దద్దరిల్లుతున్నాయి. గణపతిని చూసేందుకు భక్తులు భారీగా తరలివచ్చారు.

Similar News

News September 6, 2025

HYD: మెట్రో మిడ్‌ నైట్.. MMTS నైట్ ఔట్

image

గణపతి నిమజ్జనం వేళ HYD మెట్రో, MMTS సేవలు పొడిగిస్తున్నట్లుగా అధికారులు తెలిపారు. అర్ధరాత్రి ఒంటిగంట వరకు మెట్రో రైలు సేవలు ఉంటాయి. రేపు ఉదయం 4.40 గంటల వరకు MMTS రైళ్లు తిరగనున్నాయి. సికింద్రాబాద్‌-ఫలక్‌‌నుమా, సికింద్రాబాద్‌-హైదరాబాద్‌, హైదరాబాద్‌-లింగంపల్లి, లింగంపల్లి-ఫలక్‌నుమా, ఫలక్‌నుమా-సికింద్రాబాద్‌ మధ్య 8 MMTS రైళ్లను అందుబాటులో ఉంచుతున్నట్లు రైల్వే శాఖ పేర్కొంది.
SHARE IT

News September 6, 2025

గంగ ఒడికి బాలాపూర్‌ గణేశుడు

image

బాలాపూర్‌ గణేశుడు గంగ ఒడికి చేరాడు. ఉదయం మండపం నుంచి మొదలైన భారీ శోభాయాత్ర చార్మినార్, MJ మార్కెట్ మీదుగా అప్పర్‌ ట్యాంక్‌బండ్‌కు చేరుకొంది. సాయంత్రం 6:15 నిమిషాలకు క్రేన్‌ నంబర్ 12 వద్దకు చేరుకోగా విగ్రహానికి ఉత్సవ సమితి సభ్యులు పూజలు చేశారు. సాయంత్రం 6:30 గంటలకు సాగర్‌లో బాలాపూర్‌ గణేశుడిని నిమజ్జనం సంపూర్ణమైంది.

News September 6, 2025

ట్యాంక్‌బండ్‌లో నిమజ్జనం.. ఏరియల్ వ్యూ

image

నగరంలో గణేశ్ నిమజ్జన కార్యక్రమం సజావుగా సాగుతోందని నిర్ధారించుకునేందుకు అధికారులు ఏరియల్ వ్యూ ద్వారా పర్యవేక్షించారు. బేగంపేట విమానాశ్రయం నుంచి నిమజ్జన సరళిని మంత్రి పొన్నం ప్రభాకర్, మేయర్ గద్వాల విజయలక్ష్మీ, డీజీపీ జితేందర్, హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్, జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వీ కర్ణన్, కలెక్టర్ దాసరి హరిచందన సమీక్షించారు.