News September 6, 2025

ఈ నెల 9న ‘అన్నదాత పోరు’: YCP

image

AP: యూరియా కొరత, రైతుల సమస్యలపై నిరసనలకు వైసీపీ పిలుపునిచ్చింది. ఈ నెల 9న ‘అన్నదాత పోరు’ పేరిట కార్యక్రమం చేపట్టనున్నట్లు ప్రకటించింది. ఆ రోజు ఆర్డీవో కార్యాలయాల ఎదుట శాంతియుత నిరసనలు చేయాలని నిర్ణయించింది. దీనికి సంబంధించిన పోస్టర్‌ను పార్టీ స్టేట్ కో-ఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి రిలీజ్ చేశారు. ఈ కార్యక్రంలో పార్టీ నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Similar News

News September 6, 2025

చరిత్ర సృష్టించిన సికందర్ రజా

image

జింబాబ్వే క్రికెటర్ సికందర్ రజా సరికొత్త చరిత్ర సృష్టించారు. టీ20 ఫార్మాట్‌(టెస్టులు ఆడే దేశాలు)లో అత్యధిక POTMలు అందుకున్న ప్లేయర్‌గా రజా నిలిచారు. ఇప్పటివరకు ఆయన 18 ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డులు అందుకున్నారు. శ్రీలంకతో జరిగిన రెండో టీ20లో ఆయన POTMగా నిలిచి ఈ ఫీట్ సాధించారు. రజా తర్వాత కోహ్లీ, సూర్యకుమార్(16), మహమ్మద్ నబీ, రోహిత్(14), మహ్మద్ రిజ్వాన్, వార్నర్, మ్యాక్స్‌వెల్ (12) ఉన్నారు.

News September 6, 2025

SBIలో 6,589 జాబ్స్.. పరీక్షల తేదీ ప్రకటన

image

6,589 క్లర్క్(జూనియర్ అసోసియేట్స్) పోస్టుల భర్తీకి ఈనెల 20, 21, 27 తేదీల్లో ప్రిలిమ్స్ నిర్వహించనున్నట్లు SBI ప్రకటించింది. త్వరలో కాల్ లెటర్లు విడుదల చేయనున్నట్లు తెలిపింది. కాగా AUG 26 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు స్వీకరించింది. మొత్తం పోస్టుల్లో 5,180 రెగ్యులర్, 1,409 బ్యాక్‌లాగ్ ఉద్యోగాలున్నాయి. వీటిలో APలో 310, TGలో 250 పోస్టులు ఖాళీగా ఉన్నాయి.
వెబ్‌సైట్: <>sbi.co.in/web/careers<<>>

News September 6, 2025

అడ్మిషన్లకు నోటిఫికేషన్ విడుదల

image

APలో LAWCET, PGLCET, EdCET, PECETలో అడ్మిషన్లకు నోటిఫికేషన్ విడుదలైంది. LAWCET, PGLCETకు ఈనెల 8-11 మధ్య దరఖాస్తు ఫీజు చెల్లించాలి. 12-14 మధ్య వెబ్ ఆప్షన్స్, 17న సీట్ల కేటాయింపు చేపడతారు. EdCETకు 9-12 మధ్య ఫీజు చెల్లింపు, 13-15 మధ్య వెబ్‌ ఆప్షన్స్, 18న సీట్ అలాట్‌మెంట్ ఉంటుంది. PECETకు 10-13 మధ్య ఫీజు చెల్లింపు, 14-16 మధ్య వెబ్‌ ఆప్షన్స్‌, 19న సీట్ల కేటాయింపు ఉంటుంది. పూర్తి వివరాలకు <>క్లిక్<<>> చేయండి.