News September 6, 2025
ఏక్లవ్య ఓటీటీలో ప్రపంచస్థాయి విద్య

HYD కేంద్రంగా పనిచేస్తున్న ఎడ్యుకేషన్ టెక్నాలజీ కంపెనీ ఏక్లవ్య ఓటీటీ ప్లాట్‌ఫారాన్ని ప్రటించింది. దీనిద్వారా ప్రపంచస్థాయి విద్య అందుతుందని, పేస్ బేస్డ్ సిస్టమ్ నుంచి మాస్టరీ బేస్డ్ సిస్టమ్ వైపు అడుగు పెడుతున్నట్లు పేర్కొంది. అత్యుత్తమ ఉపాధ్యాయుల వద్ద విద్యార్థులు విద్య నేర్చుకునేందుకు వీలుగా ఈ ప్లాట్ ఫారమ్ నిర్మించినట్లు డైరెక్టర్ సంతోశ్ రెడ్డి, MLA సుధీర్ రెడ్డి ప్రారంభ కార్యక్రమంలో తెలిపారు.
Similar News
News September 6, 2025
మిథున్ రెడ్డిని కలిసిన మాజీ ఎమ్మెల్యేలు

మధ్యంతర బెయిల్‌పై శనివారం రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి విడుదలైన రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డిని మాజీ ఎమ్మెల్యేలు తలారి వెంకటరావు, సత్తి సూర్యనారాయణ రెడ్డి, జగ్గిరెడ్డి శనివారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ కార్యక్రమంలో వైసీపీ తూర్పుగోదావరి జిల్లా మాజీ ప్రచార కమిటీ అధ్యక్షుడు తోట రామకృష్ణ, ఇతర జిల్లా ముఖ్య నాయకులు కూడా పాల్గొన్నారు.
News September 6, 2025
చరిత్ర సృష్టించిన సికందర్ రజా

జింబాబ్వే క్రికెటర్ సికందర్ రజా సరికొత్త చరిత్ర సృష్టించారు. టీ20 ఫార్మాట్(టెస్టులు ఆడే దేశాలు)లో అత్యధిక POTMలు అందుకున్న ప్లేయర్‌గా రజా నిలిచారు. ఇప్పటివరకు ఆయన 18 ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డులు అందుకున్నారు. శ్రీలంకతో జరిగిన రెండో టీ20లో ఆయన POTMగా నిలిచి ఈ ఫీట్ సాధించారు. రజా తర్వాత కోహ్లీ, సూర్యకుమార్(16), మహమ్మద్ నబీ, రోహిత్(14), మహ్మద్ రిజ్వాన్, వార్నర్, మ్యాక్స్‌వెల్ (12) ఉన్నారు.
News September 6, 2025
ఏలూరు: ఛార్టర్డ్ అకౌంటెంట్ల నియామకానికి దరఖాస్తుల ఆహ్వానం

ఏలూరు జిల్లా నీటి యాజమాన్య సంస్థ 2024-25 అభివృద్ధి పనుల్లో భాగంగా ఉపాధి హామీ పథకం అమలు, అకౌంట్ల ఆడిట్ కోసం ఛార్టర్డ్ అకౌంటెంట్ల నియామకానికి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆసక్తి గల వారు దరఖాస్తులు, అర్హత పత్రాలను 12వ తేదీ సాయంత్రం 5 లోపు ఏలూరు ప్రాజెక్టు డైరెక్టర్‌కు పంపాలని ప్రాజెక్ట్ డైరెక్టర్ రఘుబాబు తెలిపారు.