News September 6, 2025
యాదాద్రి: ఫ్లోరైడ్ నిర్మూలనకు జిట్టా కృషి..

మలిదశ తెలంగాణ ఉద్యమకారుడు జిట్టా బాలకృష్ణా రెడ్డి ప్రథమ వర్ధంతిని తెలంగాణ ఉద్యమకారుల ఫోరం ఆధ్వర్యంలో జరుపుకున్నారు. వలిగొండ రాజీవ్ గాంధీ చౌరస్తాలో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఉమ్మడి జిల్లాలో ఫ్లోరైడ్ నిర్మూలనకు ఆయన చేసిన కృషి చిరస్మరణీయమైందని వక్తలు కొనియాడారు. జీవితాన్ని ప్రజలకు అంకితమిచ్చిన గొప్ప నాయకుడు జిట్టా అన్నారు. వివిధ ప్రజాసంఘాలు, రాజకీయ పార్టీల నాయకులు పాల్గొన్నారు.
Similar News
News September 6, 2025
విశాఖ: ‘ఈనెల 25 లోపు అందుబాటులోకి గ్లాస్ బ్రిడ్జి’

కైలాసగిరి పై నిర్మించిన గ్లాస్ బ్రిడ్జిని ఈనెల 25వ తేదీ లోపు ప్రజలకు అందుబాటులోకి తెస్తామని VMRDA ఛైర్మన్ గోపాల్ తెలిపారు. ఇటీవల కైలాసగిరి పై త్రిశూలం ప్రాజెక్టుకు శంకుస్థాపన చేశామన్నారు. ఇప్పటికే ప్రారంభించిన పారా సైక్లింగ్ గ్లైడింగ్‌లకు మంచి ఆదరణ లభిస్తోందని చెప్పారు. త్రిశూలం ప్రాజెక్టు రూ.5.50 కోట్లు, గ్లాస్ బ్రిడ్జి రూ.7కోట్లతో చేపట్టామన్నారు.
News September 6, 2025
వరంగల్: దేవాలయాల అభివృద్ధి పనులకు శంకుస్థాపన

వరంగల్ తూర్పు నియోజకవర్గంలో రూ.4.35 కోట్ల వ్యయంతో ఆరు దేవాలయాల అభివృద్ధి పనులకు మంత్రి కొండా సురేఖ ఈరోజు శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో మేయర్ గుండు సుధారాణి, కలెక్టర్ డాక్టర్ సత్య శారద పాల్గొన్నారు. దేవాలయాల అభివృద్ధి పనులను నాణ్యతతో, వేగవంతంగా పూర్తి చేయాలని మంత్రి ఆదేశించారు. తూర్పు నియోజకవర్గంలోని 18 దేవాలయాల అభివృద్ధిని దశలవారీగా చేపడతామని తెలిపారు.
News September 6, 2025
మంచి నిద్ర కోసం ఇలా చేయండి!

మారుతున్న జీవనశైలి, ఆహారపు అలవాట్లు, ఒత్తిడి వంటి కారణాలతో చాలామంది నిద్రలేమి సమస్యతో బాధ పడుతుంటారు. అయితే రాత్రి నిద్రపోవడానికి ముందు కొన్ని రకాల ఆకులు నమలడం/హెర్బల్ టీ చేసుకుని తాగడం వల్ల మంచి నిద్ర పడుతుందని ఆయుర్వేద వైద్యులు చెబుతున్నారు. తులసి, పుదీనా, సెలరీ, వేప, అశ్వగంధ, బ్రహ్మి ఆకుల్లో ఏదైనా ఒక రకంలో నాలుగు ఆకులను నమలడం వల్ల మంచి నిద్ర పడుతుందని సూచిస్తున్నారు.