News September 6, 2025
బాలాపూరా మజాకా.. ఏటా పెరుగుతున్న క్రేజ్

హైదరాబాద్‌లోని బాలాపూర్ లడ్డూను కైవసం చేసుకుంటే ఆర్థికంగా, ఆరోగ్యంగా, రాజకీయంగా ఉన్నత స్థాయిలో ఉంటారని భక్తుల నమ్మకం. 1994లో రూ.450తో మొదలై ఏటా పెరుగుతూ రూ.35లక్షలకు చేరింది. మొదటి నుంచి 21kgల లడ్డూను స్వామికి సమర్పిస్తున్నారు. 1998లో రూ.51వేలు పలికిన ధర 2002లో తొలిసారి రూ.లక్ష దాటింది. 2008లో రూ.5L, 2015లో రూ.10L క్రాస్ చేసింది. 2020లో కొవిడ్ వల్ల వేలం జరగలేదు. గతేడాది రూ.30.01 లక్షలు పలికింది.
Similar News
News September 6, 2025
మంచి నిద్ర కోసం ఇలా చేయండి!

మారుతున్న జీవనశైలి, ఆహారపు అలవాట్లు, ఒత్తిడి వంటి కారణాలతో చాలామంది నిద్రలేమి సమస్యతో బాధ పడుతుంటారు. అయితే రాత్రి నిద్రపోవడానికి ముందు కొన్ని రకాల ఆకులు నమలడం/హెర్బల్ టీ చేసుకుని తాగడం వల్ల మంచి నిద్ర పడుతుందని ఆయుర్వేద వైద్యులు చెబుతున్నారు. తులసి, పుదీనా, సెలరీ, వేప, అశ్వగంధ, బ్రహ్మి ఆకుల్లో ఏదైనా ఒక రకంలో నాలుగు ఆకులను నమలడం వల్ల మంచి నిద్ర పడుతుందని సూచిస్తున్నారు.
News September 6, 2025
హైదరాబాద్‌లో వినాయక నిమజ్జనం అప్డేట్స్

* ఇప్పటివరకు 2,54,685 వినాయక విగ్రహాల నిమజ్జనం పూర్తి
* హుస్సేన్ సాగర్ వద్ద అట్టహాసంగా సాగుతున్న ప్రక్రియ. గంగమ్మ ఒడికి చేరిన 10వేల విగ్రహాలు
* మరో 4,500 పెద్ద విగ్రహాల నిమజ్జనం కావాల్సి ఉందన్న సీపీ సీవీ ఆనంద్
* నిమజ్జనం నేపథ్యంలో హైదరాబాద్‌లో రేపు తెల్లవారుజాము 4.40 గంటల వరకు నడవనున్న MMTS రైళ్లు
News September 6, 2025
చరిత్ర సృష్టించిన సికందర్ రజా

జింబాబ్వే క్రికెటర్ సికందర్ రజా సరికొత్త చరిత్ర సృష్టించారు. టీ20 ఫార్మాట్(టెస్టులు ఆడే దేశాలు)లో అత్యధిక POTMలు అందుకున్న ప్లేయర్‌గా రజా నిలిచారు. ఇప్పటివరకు ఆయన 18 ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డులు అందుకున్నారు. శ్రీలంకతో జరిగిన రెండో టీ20లో ఆయన POTMగా నిలిచి ఈ ఫీట్ సాధించారు. రజా తర్వాత కోహ్లీ, సూర్యకుమార్(16), మహమ్మద్ నబీ, రోహిత్(14), మహ్మద్ రిజ్వాన్, వార్నర్, మ్యాక్స్‌వెల్ (12) ఉన్నారు.