News September 6, 2025
మధ్యవర్తుల మాటలు నమ్మొద్దు: ఎస్పీ విక్రాంత్ పాటిల్

ప్రభుత్వ, ప్రైవేటు ఉద్యోగాలు ప్రతిభ ఆధారంగానే వస్తాయని, మధ్యవర్తుల ద్వారా రావని కర్నూలు జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ స్పష్టం చేశారు. ఈ విషయాన్ని నిరుద్యోగులు గుర్తించాలని సూచించారు. దళారుల మాటలు నమ్మి మోసపోవద్దని సూచించారు. ఇలాంటి ఫిర్యాదులు ఎక్కువగా రావడంతో యువత జాగ్రత్త వహించాలని తెలిపారు.
Similar News
News September 6, 2025
విశాఖ: ‘ఈనెల 25 లోపు అందుబాటులోకి గ్లాస్ బ్రిడ్జి’

కైలాసగిరి పై నిర్మించిన గ్లాస్ బ్రిడ్జిని ఈనెల 25వ తేదీ లోపు ప్రజలకు అందుబాటులోకి తెస్తామని VMRDA ఛైర్మన్ గోపాల్ తెలిపారు. ఇటీవల కైలాసగిరి పై త్రిశూలం ప్రాజెక్టుకు శంకుస్థాపన చేశామన్నారు. ఇప్పటికే ప్రారంభించిన పారా సైక్లింగ్ గ్లైడింగ్‌లకు మంచి ఆదరణ లభిస్తోందని చెప్పారు. త్రిశూలం ప్రాజెక్టు రూ.5.50 కోట్లు, గ్లాస్ బ్రిడ్జి రూ.7కోట్లతో చేపట్టామన్నారు.
News September 6, 2025
వరంగల్: దేవాలయాల అభివృద్ధి పనులకు శంకుస్థాపన

వరంగల్ తూర్పు నియోజకవర్గంలో రూ.4.35 కోట్ల వ్యయంతో ఆరు దేవాలయాల అభివృద్ధి పనులకు మంత్రి కొండా సురేఖ ఈరోజు శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో మేయర్ గుండు సుధారాణి, కలెక్టర్ డాక్టర్ సత్య శారద పాల్గొన్నారు. దేవాలయాల అభివృద్ధి పనులను నాణ్యతతో, వేగవంతంగా పూర్తి చేయాలని మంత్రి ఆదేశించారు. తూర్పు నియోజకవర్గంలోని 18 దేవాలయాల అభివృద్ధిని దశలవారీగా చేపడతామని తెలిపారు.
News September 6, 2025
మంచి నిద్ర కోసం ఇలా చేయండి!

మారుతున్న జీవనశైలి, ఆహారపు అలవాట్లు, ఒత్తిడి వంటి కారణాలతో చాలామంది నిద్రలేమి సమస్యతో బాధ పడుతుంటారు. అయితే రాత్రి నిద్రపోవడానికి ముందు కొన్ని రకాల ఆకులు నమలడం/హెర్బల్ టీ చేసుకుని తాగడం వల్ల మంచి నిద్ర పడుతుందని ఆయుర్వేద వైద్యులు చెబుతున్నారు. తులసి, పుదీనా, సెలరీ, వేప, అశ్వగంధ, బ్రహ్మి ఆకుల్లో ఏదైనా ఒక రకంలో నాలుగు ఆకులను నమలడం వల్ల మంచి నిద్ర పడుతుందని సూచిస్తున్నారు.