News September 6, 2025
JGTL: ఉత్తమ ఉపాధ్యాయ అవార్డుకు సంజీవరెడ్డి

కథలాపూర్ మండలం గంభీర్పూర్ జడ్పీ హైస్కూల్లో ఇంగ్లీష్ టీచర్‌గా పనిచేస్తున్న నల్ల సంజీవరెడ్డి జిల్లాస్థాయి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డుకు ఎంపికైనట్లు డీఈవో ఉత్తర్వులు జారీ చేశారు. సంజీవరెడ్డి మండలంలోని గంభీర్పూర్, అంబర్పేట జడ్పీ హైస్కూళ్లలో సంజీవరెడ్డి ఇంగ్లీష్ టీచర్‌గా వినూత్నంగా బోధిస్తూ విద్యార్థులకు అర్థమయ్యేలా పాఠాలు చెప్పేవారని ఉపాధ్యాయులు తెలిపారు. ఆయనకు అవార్డు రావడం పట్ల పలువురు అభినందించారు.
Similar News
News September 6, 2025
జీఎస్టీ సంస్కరణలు.. ధన్యవాదాలు తెలిపిన నిర్మల

GST సంస్కరణలకు మద్దతిచ్చిన అన్ని రాష్ట్రాలకు కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ ధన్యవాదాలు తెలిపారు. ఈ మేరకు ఆయా రాష్ట్రాల ఆర్థికశాఖ మంత్రులకు లేఖలు రాశారు. పలువురు భిన్న అభిప్రాయాలు వ్యక్తం చేసినా, చివరకు GST కౌన్సిల్ నిర్ణయాలతో ప్రజలకు ఉపశమనం కలిగిందన్నారు. తాజా తగ్గింపుతో రాష్ట్రాలతో పాటు కేంద్రమూ ఆదాయం కోల్పోతుందని, రేట్లు తగ్గితే ప్రజల కొనుగోలు శక్తి పెరిగి ఆదాయాలు భర్తీ చేసుకోవచ్చని తెలిపారు.
News September 6, 2025
ఈఎంఆర్‌ఎస్ క్రీడా పోటీలు పకడ్బందీగా నిర్వహించాలి: మంత్రి

EMRS క్రీడా పోటీలను పకడ్బందీగా నిర్వహించాలని మంత్రి అడ్డూరి లక్ష్మణ్ కుమార్ అన్నారు. శనివారం కోనరావుపేట మండలం మర్రిమడ్లలోని ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్‌లో జరిగిన 5వ గేమ్స్ అండ్ స్పోర్ట్స్ సెలక్షన్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. కార్యక్రమంలో ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా కూడా పాల్గొన్నారు. విద్యార్థులకు క్రీడల ప్రాముఖ్యతను వివరించారు.
News September 6, 2025
వికారాబాద్: ప్రభుత్వానికి కృతజ్ఞతలు: విజయేందర్

రెవెన్యూ వ్యవస్థను పునరుద్ధరిస్తూ 5,610 మంది గ్రామ పంచాయతీ అధికారులను (జీపీఓ) నియమించినందుకు ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నట్లు జిల్లా రెవెన్యూ అసోసియేషన్ అధ్యక్షుడు విజయేందర్ తెలిపారు. శనివారం జిల్లాకు ఎంపికైన జీపీఓలతో సమావేశం నిర్వహించారు. గ్రామాలలో పరిపాలనను ప్రజలకు చేరవేసేందుకు ఈ నియామకాలు హర్షణీయమని ఆయన పేర్కొన్నారు.