News September 6, 2025
గణేష్ ఉత్సవ కమిటీలు పోలీసులకు సహకరించాలి: జిల్లా ఎస్పీ

కాగజ్‌నగర్ పట్టణంలో నేడు జరగబోయే నిమజ్జన ఉత్సవాలకు పటిష్ట పోలీసు బందోబస్తును ఏర్పాటు చేసినట్లు ఎస్పీ కాంతిలాల్ పాటిల్ తెలిపారు. శాంతియుత వాతావరణంలో నిమజ్జన ఉత్సవాలు జరుపుకోవాలన్నారు. ఉత్సవ కమిటీ నిర్వాహకులు, ప్రజలు, భక్తులు పోలీసుల సూచనలు పాటిస్తూ సహకరించాలని తెలిపారు. నిమజ్జన సమయంలో తొందరపాటు పనికిరాదన్నారు.
Similar News
News September 6, 2025
వికారాబాద్: ప్రభుత్వానికి కృతజ్ఞతలు: విజయేందర్

రెవెన్యూ వ్యవస్థను పునరుద్ధరిస్తూ 5,610 మంది గ్రామ పంచాయతీ అధికారులను (జీపీఓ) నియమించినందుకు ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నట్లు జిల్లా రెవెన్యూ అసోసియేషన్ అధ్యక్షుడు విజయేందర్ తెలిపారు. శనివారం జిల్లాకు ఎంపికైన జీపీఓలతో సమావేశం నిర్వహించారు. గ్రామాలలో పరిపాలనను ప్రజలకు చేరవేసేందుకు ఈ నియామకాలు హర్షణీయమని ఆయన పేర్కొన్నారు.
News September 6, 2025
అచ్చంపేట: రేపు ఉమామహేశ్వర ఆలయం మూసివేత

అచ్చంపేట మండలంలోని సంపూర్ణ చంద్రగ్రహణం కారణంగా అచ్చంపేట మండలం ఉమామహేశ్వర దేవస్థానాన్ని రేపు ఆదివారం ఉదయం ఉదయం 11 గంటల నుంచి సోమవారం ఉదయం 7 గంటల వరకు మూసి వేయడం జరుగుతుందని ఆలయ ఛైర్మన్ బీరం మాధవ రెడ్డి, ఈవో శ్రీనివాస్ ఒక ప్రకటన ద్వారా వెల్లడించారు. ఆలయ సంప్రోక్షణ అనంతరం పూజా కార్యక్రమాలు కొనసాగుతాయని పేర్కొన్నారు.
News September 6, 2025
వైసీపీ ‘ఉల్లి’ వీడియోలకు టీడీపీ కౌంటర్

AP: రాష్ట్రంలో <<17631026>>ఉల్లి రైతులకు<<>> ఎలాంటి సమస్య లేకుండా కూటమి సర్కార్ పనిచేస్తోందని TDP ట్వీట్ చేసింది. కానీ YCP తమ కార్యకర్తలతో దీనిపై కుట్రపూరితంగా ప్రచారం చేస్తోందని మండిపడింది. ‘కర్నూలు జిల్లా సి.బెలగల్ మండలం పోలకల్‌కు చెందిన గుండ్లకొండ కృష్ణ, వెంకటనాయుడు YCP కార్యకర్తలు. వారు కావాలనే ఖాళీ పురుగుల మందు డబ్బాలో మద్యం కలుపుకుని తాగారు. వారి ఉల్లికి క్వింటాకు రూ.800 ఇస్తామన్నా తిరస్కరించారు’ అంటూ పేర్కొంది.