News September 6, 2025
మైండ్ మ్యాపింగ్.. ప్రిపరేషన్‌లో గొప్ప సాధనం

పుస్తకంలోని కాన్సెప్టులు, మీ ఆలోచనలను అనుసంధానం చేసేలా విజువల్ రేఖాచిత్రాలను రూపొందించుకోవడాన్నే మైండ్ మ్యాపింగ్ అంటారు. ప్రిపరేషన్‌లో స్టడీ స్కిల్స్‌ను పెంపొందించడంలో ఇదొక గొప్ప సాధనం. పెద్ద సబ్జెక్టును చిన్న విభాగాలుగా విభజించుకుని గ్రాఫిక్ రూపంలో చదివితే అయోమయం తగ్గుతుంది. ఫోకస్, మెమరీ, సృజనాత్మకత పెరుగుతుంది. రివిజన్‌కు అనుకూలంగా ఉంటుంది. సమయం ఆదా అవుతుంది.
Similar News
News September 6, 2025
హాకీ ఆసియా కప్: ఫైనల్‌కు భారత్

భారత్‌లో జరుగుతున్న హాకీ ఆసియా కప్ సెమీ ఫైనల్‌లో టీమ్‌ఇండియా అదరగొట్టింది. బిహార్‌లో ఇవాళ జరిగిన మ్యాచ్‌లో చైనాపై 7-0గోల్స్‌తో ఘన విజయం సాధించింది. ఈ గెలుపుతో హర్మన్‌ప్రీత్ సింగ్ సేన ఫైనల్లో అడుగుపెట్టింది. దీంతో 9సార్లు ఆసియా కప్ ఫైనల్ చేరిన జట్టుగా రికార్డ్ సృష్టించింది. ఫైనల్ మ్యాచ్ రేపు సౌత్ కొరియాతో జరగనుంది. తుదిపోరులో గెలిచిన జట్టు 2026 FIH హాకీ వరల్డ్ కప్‌కు అర్హత సాధిస్తుంది.
News September 6, 2025
జీఎస్టీ సంస్కరణలు.. ధన్యవాదాలు తెలిపిన నిర్మల

GST సంస్కరణలకు మద్దతిచ్చిన అన్ని రాష్ట్రాలకు కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ ధన్యవాదాలు తెలిపారు. ఈ మేరకు ఆయా రాష్ట్రాల ఆర్థికశాఖ మంత్రులకు లేఖలు రాశారు. పలువురు భిన్న అభిప్రాయాలు వ్యక్తం చేసినా, చివరకు GST కౌన్సిల్ నిర్ణయాలతో ప్రజలకు ఉపశమనం కలిగిందన్నారు. తాజా తగ్గింపుతో రాష్ట్రాలతో పాటు కేంద్రమూ ఆదాయం కోల్పోతుందని, రేట్లు తగ్గితే ప్రజల కొనుగోలు శక్తి పెరిగి ఆదాయాలు భర్తీ చేసుకోవచ్చని తెలిపారు.
News September 6, 2025
వైసీపీ ‘ఉల్లి’ వీడియోలకు టీడీపీ కౌంటర్

AP: రాష్ట్రంలో <<17631026>>ఉల్లి రైతులకు<<>> ఎలాంటి సమస్య లేకుండా కూటమి సర్కార్ పనిచేస్తోందని TDP ట్వీట్ చేసింది. కానీ YCP తమ కార్యకర్తలతో దీనిపై కుట్రపూరితంగా ప్రచారం చేస్తోందని మండిపడింది. ‘కర్నూలు జిల్లా సి.బెలగల్ మండలం పోలకల్‌కు చెందిన గుండ్లకొండ కృష్ణ, వెంకటనాయుడు YCP కార్యకర్తలు. వారు కావాలనే ఖాళీ పురుగుల మందు డబ్బాలో మద్యం కలుపుకుని తాగారు. వారి ఉల్లికి క్వింటాకు రూ.800 ఇస్తామన్నా తిరస్కరించారు’ అంటూ పేర్కొంది.