News September 6, 2025
అల్లూరి: 3.63 కిలోల లిక్విడ్ గంజాయి స్వాధీనం

పాడేరు మండలం కరకపుట్టు జంక్షన్ వద్ద 3.63 కిలోల హాషిస్ ఆయిల్ స్వాధీనం చేసుకొని ఒకరిని అరెస్ట్ చేసినట్లు ఎన్ఫోర్స్మెంట్ ఏఈఎస్ కె.సురేష్ తెలిపారు. ముందస్తు సమాచారం మేరకు కరకపుట్టు జంక్షన్ వద్ద మాటు వేయగా 4 ప్యాకెట్లులో హాస్ ఆయిల్(గంజాయి లిక్విడ్) పట్టుబడిందన్నారు. ఈ ఘటనలో అలగం గ్రామానికి చెందిన వండలం చిన్నబాలన్నను అరెస్ట్ చేశామని, మరో నిందితుడు వండలం కృష్ణారావు పరారీలో ఉన్నట్లు పేర్కొన్నారు.
Similar News
News September 6, 2025
కామారెడ్డి: ఈ నెల 12లోగా నివేదిక అందించాలి: కలెక్టర్

జిల్లాలో కురిసిన అధిక వర్షాల వల్ల జరిగిన నష్టానికి గల కారణాలను క్షేత్రస్థాయిలో పరిశీలించి ఈనెల 12వ తేదీలోగా నివేదిక అందజేయాలని కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ అధికారులను ఆదేశించారు. కలెక్టర్, సబ్ కలెక్టర్, RDO, ఇరిగేషన్, R&B, పంచాయతీరాజ్, అగ్రికల్చర్, హౌసింగ్, RWS, విద్యుత్, మున్సిపల్ ఇతర శాఖల అధికారులతో టెలికాన్ఫరెన్స్‌లో మాట్లాడారు.
News September 6, 2025
దేశవ్యాప్తంగా SIR అమలుకు ఈసీ సన్నాహాలు!

దేశ వ్యాప్తంగా స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్(SIR) అమలు చేయడంపై ఈ నెల 10న ఎలక్షన్ కమిషన్(EC) కీలక భేటీ నిర్వహించనుంది. 2026లో బెంగాల్, తమిళనాడు, అస్సాం, కేరళ, పుదుచ్చేరిలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. దీంతో ఆయా రాష్ట్రాల్లో త్వరగా SIR కింద ఓట్ల వడపోత చేపట్టాలని భావిస్తోంది. అయితే బిహార్‌లో SIR అమలును కాంగ్రెస్ తీవ్రంగా వ్యతిరేకించింది. దానిపై రాహుల్ ఏకంగా యాత్ర చేపట్టిన విషయం తెలిసిందే.
News September 6, 2025
ఓరుగల్లు: భవిష్యత్ తరాలకు అందించాల్సిన బాధ్యత మనపై ఉంది: మంత్రి

కాకతీయుల కాలం నాటి చారిత్రాత్మక దేవాలయాలు మన ఓరుగల్లులో అధికంగా ఉన్నందున వాటిని పునరుద్ధరించి, భవిష్యత్ తరాలకు అందించాల్సిన బాధ్యత మనపై ఉందని మంత్రి కొండా సురేఖ అన్నారు. గ్రేటర్ వరంగల్ పరిధిలోని పలు ఆలయాలను మంత్రి సందర్శించి ఈరోజు పూజలు చేశారు. దశలవారీగా అన్ని ఆలయాల అభివృద్ధి, నవీకరణ, పునరుద్ధరణ చేపడుతామని మంత్రి చెప్పుకొచ్చారు.